ఐపీఎల్‌ను బహిష్కరించండి.. స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్
చైనా కంపెనీలకు మద్దతు పలుకుతున్న ఐపీఎల్‌పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ దేశం పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించిందంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ మండిపడుతోంది. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా బోర్డు వ్యవహరిస్తోందిని ఆ సంస్థ కో కన్వినర్ అశ్వినీ మహాజన్ అన్నారు.
చైనా కంపెనీలకు మద్దతు పలుకుతున్న ఐపీఎల్‌పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ దేశం పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించిందంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ మండిపడుతోంది. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా బోర్డు వ్యవహరిస్తోందిని ఆ సంస్థ కో కన్వినర్ అశ్వినీ మహాజన్ అన్నారు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19న మొదలయ్యే ఐపీఎల్-13వ సీజన్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో కంపెనీ సహా పలు చైనా కంపెనీలకు ఉద్వాసన పలకాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల గాల్వాన్ ఘటనలో అమరులైన వీర జవాన్ల సంఘీభావంగా దేశం యావత్తు నిలిచింది. చైనాపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చైనా కంపెనీలను, వస్తువులను నిషేధించాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మార్కెట్‌లో చైనా కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే పలు కంపెనీలపై నిషేధం విధించింది. ఈ క్రమంలో దేశ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా చైనా సంస్థలతో కొనసాగేందుకు బీసీసీఐ ప్రయత్నించడం సరైంది కాదని విమర్శించారు మహాజన్. దేశ ప్రజల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.