పొలం పంచాయితీ ప్రాణాలు తీసింది

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం రౌతుగూడెం గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బాలు మృతి చెందాడు. భూ వివాదం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా ఒకరిపై ఒకరు కర్రలతో దాడులకు పాల్పడ్డారు.

పొలం పంచాయితీ ప్రాణాలు తీసింది

ఓ చిన్న పొలంగట్టు తగాదా.. మహబూబాబాద్‌ జిల్లాలోని ఓ టెన్షన్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొత్తగూడ మండలం రౌతు గూడెంలో రెండు వర్గాలు పోటాపోటాగా దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా రెండు వర్గాల నుంచి పదుల సంఖ్యలో గాయపడ్డారు.

పొలం సరిహద్దు విషయంలో ఆంగోతు బాలు.. అతని ప్రత్యర్థి బాబూలాల్ మధ్య వివాదం మొదలైంది. భూ వివాదం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా ఒకరిపై ఒకరు కర్రలతో దాడులకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ బాలును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.  దీంతో దాడి చేసిన హత్తిరామ్ ఇంటిని, అతని ట్రాక్టర్ ను తగలబెడ్డారు మృతుడి బంధువులు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు ఆగ్రహంతో ప్రత్యర్థులకు సంబంధించిన నాలుగు ఇళ్లకు నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రౌతుగూడెం చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

Click on your DTH Provider to Add TV9 Telugu