కోవిడ్ సెంటర్ లోకి ఎంటర్, చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే

త్రిపురలో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కూడా అయిన సుదీప్ రాయ్ బర్మన్ చిక్కుల్లో పడ్డారు. కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారని,

కోవిడ్ సెంటర్ లోకి ఎంటర్, చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే

త్రిపురలో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కూడా అయిన సుదీప్ రాయ్ బర్మన్ చిక్కుల్లో పడ్డారు. కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారని, అనధికారికంగా కోవిడ్ కేర్  సెంటర్ ని సందర్శించారని ఆయనపై కోర్టు కేసు నమోదయింది. అగర్తల లోని తన నియోజకవర్గంలో ఓ కరోనా రోగి తమ సెంటర్లోని అధ్వాన్న పరిస్థితులపై సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేశాడు. అది చూసి న ఈ బీజేపీ ఎమ్మెల్యే పీపీఈ సూట్ ధరించి ఆ కేంద్రాన్ని విజిట్ చేసి కరోనా పేషంట్ల దయనీయ పరిస్థితులపై ఆరా తీశారు. ఈ విషయం వెస్ట్ త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి వెళ్లడంతో ఆయన తనకు తానుగా సుమోటో కేసు ఫైల్ చేశారు. సుదీప్ రాయ్ ని తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్ కి వెళ్లాలని ఆదేశించారు. అయితే సుదీప్ ఇందుకు నిరాకరించారు. ఇది దురుద్దేశంతో కూడిన ఉత్తర్వులని అన్నారు. అసలు తనకు మేజిస్ట్రేట్ జారీ చేసిన మెమొరాండం అందక ముందే మొదట మీడియాకు, ఆ తరువాత సోషల్ మీడియాకు ఎలా ఎక్కిందని ప్రశ్నించిన ఆయన.. నేను ఎంచక్కా డాక్టర్ల సలహా, వైద్య అధికారుల సూచన తీసుకునే ఒళ్ళంతా పీపీఈ కిట్ ధరించి ఆ కోవిడ్ సెంటర్లోకి వెళ్లానని, పైగా పేషంట్లకు ఒక మీటర్ దూరం నిలబడి వారి బాధలు విన్నానని అన్నారు.

నేను 14 రోజులపాటు క్వారంటైన్ కి వెళ్లే ప్రసక్తే లేదు అని సుదీప్ కుండబద్దలు కొట్టారు.

 

Click on your DTH Provider to Add TV9 Telugu