‘వజ్ర కవచధర గోవింద’ సినిమా రివ్యూ..!

టైటిల్ : వజ్ర కవచధర గోవింద నటీనటులు : సప్తగిరి, వైభవి జోషి, శ్రీనివాస్ రెడ్డి, అర్చన తదితరులు సంగీతం : విజయ్ బుల్గానిన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అరుణ్ పవార్ విడుదల తేదీ: 14-06-2019 కమెడియన్ సప్తగిరి హీరోగా, వైభవి జోషి హీరోయిన్‌గా, శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘వజ్ర కవచధర గోవింద’. ఫుల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించడానికి ఈ సినిమాను తీసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి […]

'వజ్ర కవచధర గోవింద' సినిమా రివ్యూ..!
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2019 | 4:08 PM

టైటిల్ : వజ్ర కవచధర గోవింద

నటీనటులు : సప్తగిరి, వైభవి జోషి, శ్రీనివాస్ రెడ్డి, అర్చన తదితరులు

సంగీతం : విజయ్ బుల్గానిన్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అరుణ్ పవార్

విడుదల తేదీ: 14-06-2019

కమెడియన్ సప్తగిరి హీరోగా, వైభవి జోషి హీరోయిన్‌గా, శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘వజ్ర కవచధర గోవింద’. ఫుల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించడానికి ఈ సినిమాను తీసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి అరుణ్ పవర్ దర్శకత్వం వహించగా, శివ శివం ఫిల్మ్స్ బ్యానర్‌పై నరేంద్ర, జీవిఎన్ రెడ్డిలు నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించగలిగిందా..? లేదా తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకోవాల్సిందే..!

కథ :

గోవింద (సప్తగిరి) ఊరి కోసం ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి. అనుకోకుండా తన ఊరి జనం వరుసగా క్యాన్సర్‌తో చనిపోతుండటాన్ని జీర్ణించుకోలేకపోతాడు. తన ఊరి జనాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఓ ఎమ్మెల్యే చేతిలో మోసపోతాడు. ఆ తర్వాత ఏం చేయాలన్న సందర్భంలో ‘నిధి’ రూపంలో మరో అవకాశం వస్తుంది. ఆ నిధిని దక్కించుకునే ప్రయత్నంలో అనేక చిక్కుల్లో పడతాడు సప్తగిరి. అయితే.. అసలు సప్తగిరికి ఆ నిధి దక్కిందా..? తన ఊరి ప్రజల కష్టాలు తీర్చాడా..? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే :

ఈ సినిమాలో హీరోగా నటించిన సప్తగిరి నటనే ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంచి టైమింగ్‌తో అటు కామెడీ, ఇటు సీరియస్‌నెస్‌ని రెండూ బాగా మెయిన్‌టైన్ చేశాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో కూడా ఓకే అనిపించాడు. హీరోయిన్ జోషి కూడా పాత్రకు తగ్గట్టుగా నటించింది. ఇక చివర్లో ఎంటర్‌ అయిన శ్రీనివాస రెడ్డి, వేణు అలాగే మిగిలిన కమెడియన్స్ అందరూ తమ కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. విలన్ పాత్రలో నటించిన బంగారయ్య కూడా తన ఆహార్యంతో కథలో సీరియస్ నెస్ క్రియేట్ చేశారు.

ఎలా ఉందంటే :

ఈ సినిమాలో చెప్పుకోవడానికి చాలా క్యారెక్టర్స్ ఉన్నా కానీ ఏదీ ప్రేక్షకుడి మనసుకు హత్తుకునే విధంగా ఉండదు. డైరెక్టర్ తనకు నచ్చింది రాసుకుంటూ వెళ్లిపోయాడు. మొదటి భాగంలో హీరో కథను, అతని సమస్యను పరిచయం చేయడానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. అలాగే సినిమా రెండో భాగం కూడా అంత ఆసక్తిగా అనిపించదు. శ్రీనివాస్ రెడ్డి, అర్చన, వేణు లాంటి మంచి ఆర్టిస్ట్‌లను కూడా డైరెక్టర్ సరైన విధంగా వాడుకోలేదనిపిస్తుంది. అలాగే.. అక్కడక్కడ హీరోగా కనిపించడానికి సప్తగిరికి అనవసరమైన బిల్డప్స్ షాట్స్ ఇవ్వటం కాస్త ఇబ్బందిగానే అనిపించిందనే చెప్పాలి. కాగా.. ఈ సినిమా మొత్తంగా కామెడీని కూడా పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయలేం. కామెడీ పండని, లాజిక్ లేని సినిమాగా వజ్ర కవచధర మిగిలిపోయింది.