A1 Express Movie Review: గమ్యాన్ని చేరుకున్న ‘A1 ఎక్స్‏ప్రెస్’.. హాకీ ప్లేయర్‏గా మెప్పించిన సందీప్ కిషన్..

సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు క్రికెట్, రబ్బీ, కుస్తీ, ఫుట్ బాల్ నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. కానీ హాకీ నేపథ్యంలో ఇంతవరకు ఎలాంటి సినిమా రాలేదు. ఎప్పుడు

A1 Express Movie Review: గమ్యాన్ని చేరుకున్న 'A1 ఎక్స్‏ప్రెస్'.. హాకీ ప్లేయర్‏గా మెప్పించిన సందీప్ కిషన్..
Follow us

|

Updated on: Mar 05, 2021 | 6:04 PM

సినిమా : A1 ఎక్స్‏ప్రెస్ నటీనటులు: సందీప్ కిష‌న్‌, లావ‌ణ్య త్రిపాఠి, రావు ర‌మేష్‌, మురళీ శర్మ, పోసాని కృష్ణముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్యా, రాహుల్ రామ‌కృష్ణ తదితరులు దర్శకత్వం: డెన్నీస్ జీవన్ కనుకొలను సంగీతం: హిప్ హాప్ తమిళ నిర్మాతలు: టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్ అగర్వాల్ విడుదల: మార్చి 5, 2021

సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు క్రికెట్, రబ్బీ, కుస్తీ, ఫుట్ బాల్ నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. కానీ హాకీ నేపథ్యంలో ఇంతవరకు ఎలాంటి సినిమా రాలేదు. ఎప్పుడు విభిన్న సినిమాల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. తాజాగా ఈ హీరో “ఏ1 ఎక్స్ ప్రెస్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 5న థియేటర్లలో విడుదలైంది. ఇందులో సందీప్ కిషన్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహించగా.. టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.

కథ…

సందీప్ (సందీప్ కిషన్).. హాకీ ప్లేయర్ అయిన లావణ్య (లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి కోసం యానాంలోని తన మావయ్య ఇంటికొస్తాడు. అయితే సందీప్ మెల్లగా ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఇక ఆమెకు ప్రతి విషయంలో సహాయం చేస్తూ ఉండగా.. అనుకోకుండా తను హాకీ ప్లేయర్ అన్ని విషయం తెలిసిపోతుంది. అండర్ 21 స్థాయిలో ఇండియన్ కెప్టెన్ అని.. కానీ అనుకోని కారణాల వల్ల అతను హాకీని వదిలిపెట్టినట్లుగా అర్థమవుతుంది. అయితే తిరిగి కొన్ని పరిస్థితులతో హాకీ ఆటలోకి వెళ్తాడు సందీప్. హాకీ వదిలేయడానికి గల కారణం.. మళ్లీ ఆటలోకి ఎందుకు రావాల్సి వచ్చిందనే కారణాలే ఈ ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీ.

నటీనటులు..

నేషనల్‌ హాకీ ప్లేయర్‌ సందీప్‌ పాత్రలో సందీప్‌ కిషన్‌ జీవించేశాడు. ఈ‌ పాత్ర కోసం సందీప్‌ కిషన్‌ పడ్డ కష్టం ప్రతీ సీన్‌లో కనిపిస్తుంది.ఇక హాకీ క్రీడాకారిణిగా‌ లావణ్య త్రిపాఠి కూడా ఆకట్టుకుంది. టామ్‌ బాయ్‌ రోల్‌లో మెప్పించారు. ఇక ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌ తర్వాత బాగా పండిన పాత్ర మురళీ శర్మది. హాకీ కోచ్ పాత్రలొ ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. ఒక నిజాయతీగల కోచ్‌కు గేమ్‌పై, గ్రౌండ్‌పై ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమాలో మరళీ శర్మ పాత్ర తెలియజేస్తుంది. ఇక క్రీడాశాఖ మంత్రిగా రావు రమేశ్‌ జీవించేశాడు. ఒక అవినీతి రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో, స్వార్థం కోసం ప్రజల మధ్య ఎలా చిచ్చు పెట్టిస్తారనేది రావుగారు వాస్తవాన్ని చూపించేశారు. హీరో స్నేహితులుగా రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి మరోసారి తామెంటో నిరూపించుకున్నారు. నిడివి తక్కువే అయినా.. వీరిద్దరి పాత్రే సినిమాకు కీలకం. హీరో స్నేహితుడిగా సత్య తనదైన శైలిలో నవ్వించేశాడు. మహేశ్‌ విట్టా, పొసాని కృష్ణమురళి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ..

ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లాగే.. ఆటను అత్యధికంగా ప్రేమించే క్రీడాకారుడు.. కొన్ని బలమైన కారణాల వలన ఆటను ఎలా వదులుకోవాల్సి వస్తుందో.. సమస్య పరిష్కారం కోసం కూడా అదే ఆటలోకి రావడం.. ప్రేక్షకుల కళ్ళముందుకు తీసుకువచ్చారు. ఇప్పటివరకు రానీ హాకీ నేపథ్యంలో ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ తెరెక్కించడమనేది ముఖ్యంగా ఈ మూవీకి ప్లస్ అని చెప్పుకోవాలి. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు గిల్లికజ్జాలు, ఇతర నటీనటుల భావోధ్వేగాలతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులను హత్తుకునేలా ఉన్నాయి. స్పోర్ట్స్ తర్వాతా ఈ సినిమాకు కలిసివచ్చేది స్నేహబంధం. సందీప్ కిషన్, రాహుల్, ప్రియదర్శి మధ్య వచ్చే సన్నివేశాలను స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చేప్పే ప్రయత్నం చేశాడనుకోవచ్చు. ఇక కథ పరంగా చూస్తే హీరోహీరోయిన్ల దగ్గరి నుంచి హాస్యనటుల వరకు ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో జీవించేశారు. కానీ ఈ సినిమా మొత్తంలో హీరో ప్లాష్ బ్యాక్ లో కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయ్యే విధంగా కనిపించడం లేదు. ఇక హాకీ నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో హీరో మాత్రమే ఎంపిక కావడం.. అతని స్నేహితులు ఎంపిక కాకపోడానికి చూపించే రీజన్స్ కొంతవరకు నాటకీయంగా అనిపిస్తాయి. హాకీ మైదానం ఉన్నచోట హాస్పిటల్ కట్టాలనుకోవడం.. దానికి వ్యతిరేకంగా కోచ్-ఆటగాళ్లు ఎదురు తిరగడం.. మ్యాచ్ గెలిస్తే గ్రౌండ్ మీదే అన్న ఛాలెంజ్.. ఆటలోకి తిరిగి రానే రానని భీష్మించుకున్న హీరో ఈ మ్యాచ్ కోసం రంగంలోకి దిగడం.. ఇవన్నీ కూడా చాలా రొటీన్ గా అనిపించే విషయాలు.చివరి 20 నిమిషాలు మాత్రం అదిరిపోతుంది. సినిమా చూస్తున్నామనే ఫీలింగ్‌ మర్చిపోయి హాకీ ఫైనల్‌ మ్యాచ్‌ని తిలకిస్తున్న భావన కలుగుతుంది. ఇక సినిమాకు ప్రధాన బలం హిప్‌ హాప్‌ తమిళ సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు.

సాంకేతిక వర్గం..

ఈ సినిమాకు ప్లస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ వెర్షన్ అనేలా మ్యూజిక్ అందించాడు. సినిమా చూస్తున్నంతసేపు తమిళ సినిమా అనే భ్రమ కలుగుతుంది. ఇక కవిన్ రాజా ఛాయగ్రహణం ఓకే. విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా.. సందీప్ కిషన్ యాక్టింగ్ గుడ్. ‘ఏ1 ఎక్స్‏ప్రెస్’… అక్కడక్కడా నెమ్మదైనా.. గమ్యాన్ని చేరుకుంది.

Also Read:

ఒకే ఒక్క డైలాగ్.. కానీ టీజర్ మాత్రం తెగ వైరల్.. ఈ ‘ఆకాశవాణి’పై మీరు ఓ లుక్కేశారా..?

టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు..
'అరకొర వివరాలు వెల్లడిస్తారా?' ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు సీరియస్‌
'అరకొర వివరాలు వెల్లడిస్తారా?' ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు సీరియస్‌
ఆధార్‌కు మొబైల్ లింక్ చేయడం ఎలా? చాలా సింపుల్..
ఆధార్‌కు మొబైల్ లింక్ చేయడం ఎలా? చాలా సింపుల్..