Varudu Kaavalenu Review: చెప్తే అలుసైపోతారేమో… చెప్పకుంటే మిస్ అయిపోతారు… వరుడు కావలెను కాన్సెప్ట్!
Varudu Kaavalenu Movie Review: సితార ఎంటర్‌టైన్మెంట్స్ అనే బ్యానర్ పేరు వినగానే ఫీల్ గుడ్ మూవీస్ అనే ఫీల్ ఉంది. దాన్ని క్యారీ ఫార్వార్డ్ చేస్తూ తెరకెక్కిన సినిమా వరుడు కావలెను.
Varudu Kaavalenu Movie Review: సితార ఎంటర్‌టైన్మెంట్స్ అనే బ్యానర్ పేరు వినగానే ఫీల్ గుడ్ మూవీస్ అనే ఫీల్ ఉంది. దాన్ని క్యారీ ఫార్వార్డ్ చేస్తూ తెరకెక్కిన సినిమా వరుడు కావలెను. ఫస్ట్ లుక్, గ్లింప్స్ నుంచి సాంగ్స్, ట్రైలర్, టైటిల్… కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే విషయాన్ని గట్టిగా చెప్పింది. ఇంతకీ వరుడు కావలెను అనే టైటిల్ ఎందుకు పెట్టారు? వరుడు మంచివాడు దొరికినట్టేనా? ప్రేక్షకుల మనసు దోచుకుంటాడా?
సినిమా: వరుడు కావలెను నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్మెంట్స్, నటీనటులు: నాగశౌర్య, రీతువర్మ, మురళీ శర్మ, నదియ, జయప్రకాష్, వెన్నెల కిశోర్, ప్రవీణ్, కిరీటి దామరాజు, హిమజ, హర్షవర్ధన్ తదితరులు దర్శకత్వం: లక్ష్మీ సౌజన్య నిర్మాత: సూర్యదేవర నాగవంశీ కెమెరా: పచ్చిపులుసు వంశీ, విష్ణు శర్మ ఎడిటింగ్: నవీన్ నూలి సంగీతం: విశాల్ చంద్రశేఖర్
అతని పేరు ఆకాష్ (నాగశౌర్య). ఫారిన్‌లో ఆర్కిటెక్ట్ గా పేరున్న వ్యక్తి. 200 కోట్ల బ్యాంక్ బ్యాలన్స్ వస్తుందనుకున్నా కొన్ని పనులు చేయడు. ఉన్నపళాన ఇండియా గుర్తొచ్చి తన ఫ్రెండ్ (ప్రవీణ్)తో కలిసి వచ్చేస్తాడు. ఇక్కడ అతనికి సేవ్ నేచర్ కాన్సెప్ట్ తో స్టార్టప్ రన్ చేస్తున్న భూమి (రీతువర్మ) కలుస్తుంది. వాళ్లిద్దరికీ ఆల్రెడీ కాలేజ్‌లో పరిచయం ఉంటుంది. ఎంత పరిచయం ఉన్నా, అతను తన ప్రాజెక్ట్ కోసం ఓ డిజైన్ చేసి పెట్టడాన్ని ఆమె ఇష్టపడదు. కానీ, ఆమెకు ఫండింగ్ ఇచ్చే వ్యక్తి ఫోర్స్ చేయడంతో కాదనలేకపోతుంది. భూమి అభిరుచులకు తగ్గట్టు డిజైన్ చేసిస్తాడు ఆకాష్. అప్పటిదాకా ఏ అబ్బాయినీ సెలక్ట్ చేయని భూమి… ఆకాష్‌తో ప్రేమలో పడుతుంది. తీరా అతనికి ఆ విషయాన్ని చెప్పడానికి వెళ్తుంది. అయితే తాను పెళ్లి చూపులకు వెళ్తున్నానని అంటాడు ఆకాష్. దాంతో భూమి మనసు విరిగిపోతుంది. ఒకసారి ప్రేమలో పడి తప్పు చేశానని, రెండో సారి అదే తప్పు రిపీట్ చేశానని అంటుంది. ఇంతకీ ఆ మాట ఎందుకన్నట్టు? పారిన్ నుంచి ఆకాష్ ఎందుకు వచ్చాడు? తల్లి చూసిన పెళ్లి కొడుకును భూమి చేసుకుందా? వంటివన్నీ సినిమా చూసి తెలుసుకోవాలి.
నాగశౌర్యకి టైలర్ మేడ్ కేరక్టర్ ఇది. మడత నలగని చొక్కాలతో స్క్రీన్ మీద మరింత క్లాస్‌గా కనిపించాడు. లవర్‌బోయ్ ఇమేజ్‌కి పక్కాగా సరిపోయే మరో కేరక్టర్ ఇది. అటు కాలేజీ లుక్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. రీతువర్మ ఫస్టాఫ్ మొత్తం కాటన్ చీరలతోనూ, సెకండ్ హాఫ్ కాస్త మోడ్రన్ డ్రస్సులతోనూ కనిపించింది. మిగిలిన ఆర్టిస్టులు కూడా వాళ్ల వాళ్ల కేరక్టర్లకు న్యాయం చేశారు. నదియా కేరక్టర్ చాలా మంది మోడ్రన్ మమ్మీలను గుర్తుచేస్తుంది. మురళీశర్మ చెప్పిన ప్రతి మాటా ఆలోచింపజేస్తుంది.
అక్కడక్కడా డైలాగులు బావున్నాయి. సందర్భానుసారంగా వచ్చే పాటలు మెప్పిస్తాయి. ఆర్ ఆర్ కూడా కథలో సాగిపోతుంది. సెకండ్ హాఫ్‌లో సప్తగిరితో ల్యాగ్ వద్దు డైలాగ్, నిదానంగా కదిలే కేరక్టర్ హైలైట్ అయ్యాయి. అమ్మాయిలు ప్రేమను ముందుగా వ్యక్తం చేస్తే అలుసైపోతారు అనేది ఏజ్ ఓల్డ్ మాట. మనసులో మాట చెప్పకుండా వాళ్లల్లో వాళ్లే మదనపడిపోయి, ఆన్సర్ రాలేదని ఆవేశపడటం మంచిది కాదనే నదియా డైలాగ్ కూడా అమ్మాయిలకు బాగా కనెక్ట్ అవుతుంది.
సినిమాలో చాలా సీన్లు ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. ఫైట్లు కూడా ఏదో పెట్టాలంటే పెట్టినట్టు ఉంటాయి. హీరో వెళ్లి తల్లిదండ్రులను కలిసి మెప్పించడం తరహా కొన్ని సీన్లు దానికి ఎగ్జాంపుల్. అలాంటి చిన్న చిన్న విషయాలను వదిలేస్తే వరుడు కావలెను క్లాస్ మూవీ! యువతకి, ఫ్యామిలీస్‌కి కనెక్ట్ అయ్యే సినిమా. ఫస్ట్ సినిమాతో లక్ష్మీ సౌజన్య మంచి స్టెప్ వేసినట్టే.
– డా. చల్లా భాగ్యలక్ష్మి, టీవీ9 తెలుగు
Read More Reviews..
Pelli SandaD Movie Review: పాత పెళ్లి సందడిని గుర్తుచేసిన… పెళ్లి సందD