Most Eligible Bachelor Review: అనుమానాలు… భయాలు… వాటికి పర్ఫెక్ట్ సమాధానాలు… మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌

Most Eligible Bachelor Review: బొమ్మరిల్లులాంటి సినిమా తీసిన డైరక్టర్‌... కేరక్టర్‌ కోసం ఎంతైనా కష్టపడే హీరో... యూత్‌ని అట్రాక్ట్ చేయగలిగిన హీరోయిన్‌...

Most Eligible Bachelor Review: అనుమానాలు... భయాలు... వాటికి పర్ఫెక్ట్ సమాధానాలు... మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌
Most Eligible Bachelor Movie

Most Eligible Bachelor Movie Review: బొమ్మరిల్లులాంటి సినిమా తీసిన డైరక్టర్‌.. కేరక్టర్‌ కోసం ఎంతైనా కష్టపడే హీరో.. యూత్‌ని అట్రాక్ట్ చేయగలిగిన హీరోయిన్‌… ఆల్రెడీ హిట్‌ అయిన పాటలు… మేకింగ్ ప‌రంగా కాంప్ర‌మైజ్ కాని ప్రొడ్యూస‌ర్స్… వీటన్నిటికి తోడు దసరా సందడి.. మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్ ఏంటి? చదివేయండి.

సినిమా: మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ నటీనటులు: అఖిల్‌, పూజా హెగ్డే, జేపీ, ఆమని, మురళీశర్మ తదితరులు నిర్మాణ సంస్థ: జీఏ2 పిక్చర్స్ సమర్పణ: అల్లు అరవింద్‌ నిర్మాతలు: బన్నీ వాసు, వాసు వర్మ దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్‌ సంగీతం: గోపీ సుందర్‌ ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌ విడుదల: 15.10.2021

హ‌ర్ష (అఖిల్‌) ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌. యుఎస్‌లో కావాల్సినంత సంపాద‌న‌, కోరుకున్న‌ట్టు తీర్చిదిద్దుకున్న ఇల్లు, వ‌స్తువులు, ప‌ర్ఫెక్ట్ ఫ్యామిలీ అన్నీ ఉంటాయి. ఇండియాకి వెళ్లి త‌న వాళ్లు చూసిన సంబంధం చేసుకోవాల‌ని ప్లాన్ వేసుకుంటాడు. అందులో భాగంగా 20 సంబంధాలు చూడాల‌ని టైమ్ ఫిక్స్ చేసుకుంటాడు. అందులో స్టాండ‌ప్ క‌మెడియ‌న్ విభ (పూజా హెగ్డే) సంబంధం కూడా ఒక‌టి. అయితే జాత‌కాలు క‌ల‌వ‌ని కార‌ణంగా అది సెట్ కాదు. అనుకోని ప‌రిస్థితుల్లో విభ‌ను త‌ర‌చూ క‌ల‌వాల్సి వ‌స్తుంది హ‌ర్ష‌కి. ఆ క్ర‌మంలోనే పెళ్లి గురించి ఆమెకున్న అనుమానాల‌న్నీ అడుగుతుంది. వాటిని త‌న పెళ్లి చూపుల్లో అడుగుతుంటాడు హ‌ర్ష‌. అయితే ఉన్న‌ప‌ళంగా సీన్ రివ‌ర్స్ అవుతుంది. హ‌ర్ష యుఎస్‌కి వెళ్లిపోవాల్సి వ‌స్తుంది. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత అత‌ని మ‌న‌సు మారిపోతుంది. త‌న గురించి తాను అర్థం చేసుకోవ‌డం మొద‌లుపెడ‌తాడు. ఆ త‌ర్వాత ఇండియాకి తిరిగి వ‌చ్చిన అత‌ను ఏం చేశాడు? విభ‌ను క‌లిశాడా?ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం చేసుకున్నాడా? అస‌లు పెళ్లి గురించి హ‌ర్ష తెలుసుకున్న‌దేంటి? వంటి విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Most Eligible Bachelor

Most Eligible Bachelor

హ‌ర్ష కేర‌క్ట‌ర్‌కి ప‌ర్ఫెక్ట్ గా సూట‌య్యారు అఖిల్‌. ఫ‌స్టాఫ్‌లో క‌నిపించే అఖిల్‌కీ, సెకండ్ హాఫ్‌లో అత‌ని లుక్‌కి కంప్లీట్ వేరియేష‌న్ ఉంది. బాడీ లాంగ్వేజ్ ప‌రంగా, యాక్టింగ్ ప‌రంగా స్క్రీన్ మీద ఈజ్ క‌న‌బ‌రిచారు అఖిల్‌. పూజా గ‌త సినిమాల‌తో పోలిస్తే ఈ సినిమాలో మ‌రింత మెచ్యూర్డ్ యాక్టింగ్ చూపించారు. స్టాండ‌ప్ క‌మెడియ‌న్ త‌ర‌హా రోల్స్ నార్త్ వాళ్ల‌కు సూట‌వుతాయి కానీ, మ‌న ద‌గ్గ‌ర పెద్ద‌గా అవేర్‌నెస్ లేదు. అయినా ఎక్క‌డా ఎబ్బెట్టుగా అనిపించ‌కుండా, చాలా జాగ్ర‌త్త‌గా, సెన్సిటివ్‌గా డీల్ చేశారు డైర‌క్ట‌ర్‌. పూజా పెర్ఫార్మెన్స్ బావుంది. ముర‌ళీశ‌ర్మ‌, ప్ర‌గ‌తి, జేపీ, ఆమ‌ని.. మిగిలిన అంద‌రూ త‌మ త‌మ రోల్స్ కి న్యాయం చేశారు. అస‌లు పెళ్లంటే ఏంటి? స‌ర్దుకుపోవ‌డ‌మా? న‌చ్చిన‌ట్టు ఉండ‌ట‌మా? అనే చిన్న థ్రెడ్‌ని చాలా పొందిగ్గా సినిమాగా అల్లారు భాస్క‌ర్‌. స్క్రీన్ ప్లే రాసుకున్న తీరు బావుంది. సాంగ్స్ లో మాంటేజ్ విజువ‌ల్స్ కూడా కొత్త‌గా అనిపించాయి. ఫ‌స్ట్ హాఫ్ యూత్‌ని, సెకండాఫ్ ఫ్యామిలీ ఆడియ‌న్స్ నీ టార్గెట్ చేసుకుని రాసుకున్నార‌నిపించింది. అయినా ఫ‌స్ట్ హాఫ్‌లో వ‌చ్చే ప్ర‌తి విష‌యాన్నీ సెకండ్ హాఫ్‌లో క‌నెక్ట్ చేసిన తీరు కూడా మెప్పిస్తుంది.

ట్రైల‌ర్ చూసి సినిమాకు వ‌చ్చిన వారికి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఉంటుంది. ట్రైల‌ర్‌లో ఉన్న డైలాగులు, సినిమాలో వాడిన తీరుకు ముచ్చ‌టేస్తుంది. కొన్ని స‌ర‌దాగా సాగితే, మ‌రికొన్ని డైలాగులు మ‌న‌సు లోతుల‌ను ట‌చ్ చేస్తాయి. మ‌రీ ముఖ్యంగా విభ భ‌య‌ప‌డి ఇంటికి చేరిన‌ప్పుడు హ‌ర్ష ఊర‌డించే సీన్‌. ఫోన్ నిండా కాంటాక్టులే ఉన్నా, ప‌ల‌క‌రించ‌డానికి ప‌ర్ఫెక్ట్ మ‌నిషి లేని సంద‌ర్భాలు చాలా మంది జీవితాల్లో ఉండే ఉంటాయి. అలాంటి వారంద‌రికీ క‌నెక్ట్ అయ్యే సీన్ అది. మరీ ముఖ్యంగా నాన్న‌కు చెబుదామంటే తిడుతారేమోన‌ని భ‌యం అని పూజా హెగ్డే చెప్పిన తీరు కూడా ఆస‌మ్‌. గ‌త సినిమాల‌తో పోలిస్తే పూజా హెగ్డే డ‌బ్బింగ్ కూడా చాలా మెరుగ్గా అనిపించింది. ఇన్‌ఫ్యాక్ట్ ఆమె అంత బాగా చెప్పింది కాబ‌ట్టే జ‌నాలు క‌నెక్ట్ అయ్యారు. చాన్నాళ్ల త‌ర్వాత ప్ర‌గ‌తికి కూడా మంచి కేర‌క్ట‌ర్ ప‌డింది. భ‌ర్త‌కు భ‌య‌ప‌డి ఇంటి గోడ దూకి ప‌క్కింట్లోకి వెళ్లే సీన్‌కి థియేట‌ర్లో ప్రేక్ష‌కులు చ‌ప్ప‌ట్లు కొట్టి న‌వ్వుతున్నారు.

Most Eligible Bachelor

Most Eligible Bachelor

లెహ‌రాయి లెహ‌రాయి పాట మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుకునేలా ఉంది. మిగిలిన పాట‌లు కూడా స‌ర‌దాగా సినిమాతో క‌లిసిపోయాయి. లొకేష‌న్లు, కెమెరా, రీరికార్డింగ్ వేటిక‌వే కొత్త‌గా ఉన్నాయి. హీరో, హీరోయిన్ల కాస్ట్యూమ్స్, వాటి క‌ల‌ర్స్ కూడా అట్రాక్టివ్‌గా అనిపించాయి. మేకింగ్ వేల్యూస్ ని మెచ్చుకుని తీరాల్సిందే. ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌లేదు. స్క్రీన్ మీద అంత మంది ఆర్టిస్టులు, లావిష్‌నెస్ చూస్తేనే ఖ‌ర్చు క‌ళ్ల‌ముందు క‌నిపిస్తుంది. విభ కేర‌క్ట‌ర్ బొమ్మ‌రిల్లులో హాసినికి అప్‌గ్రేడ్ వెర్ష‌న్‌లా అనిపించినా జ‌నాలు ఎంజాయ్ చేస్తారు. అఖిల్ ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన హిట్ ఈసినిమాతో వ‌చ్చిన‌ట్టే. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌ని ఈ మూవీ మ‌ళ్లీ ట్రాక్ ఎక్కించింద‌ని చెప్పొచ్చు. ఈ ద‌సరా మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌!

– డా. చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి, టీవీ9 తెలుగు

Also Read..

Maha Samudram Review: ప్రేమ… స్నేహం… బంధం… బాధ్యతల కలయిక ‘మహా సముద్రం’

Konda Polam Movie Review: ఓ పర్పస్‌ ఉందని నమ్మేవారి కోసం… కొండ పొలం!

Click on your DTH Provider to Add TV9 Telugu