జెస్సీ తెలుగు మూవీ రివ్యూ
టైటిల్ : జెస్సీ తారాగణం : అభినవ్ గౌతమ్, అతుల్ కులకర్ణి, కబీర్ సింగ్, పావని గంగిరెడ్డి సంగీతం : శ్రీచరణ్ పాకాలా దర్శకత్వం : వి. అశ్వని కుమార్ నిర్మాత : శ్వేతా సింగ్ ఇంట్రడక్షన్: అశ్వని కుమార్ డైరెక్షన్ లో అభినవ్ గౌతమ్, అతుల్ కులకర్ణి, కబీర్ సింగ్, పావని గంగిరెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జెస్సీ’. కాగా ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో ఈ […]
టైటిల్ : జెస్సీ
తారాగణం : అభినవ్ గౌతమ్, అతుల్ కులకర్ణి, కబీర్ సింగ్, పావని గంగిరెడ్డి
సంగీతం : శ్రీచరణ్ పాకాలా
దర్శకత్వం : వి. అశ్వని కుమార్
నిర్మాత : శ్వేతా సింగ్
ఇంట్రడక్షన్:
అశ్వని కుమార్ డైరెక్షన్ లో అభినవ్ గౌతమ్, అతుల్ కులకర్ణి, కబీర్ సింగ్, పావని గంగిరెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జెస్సీ’. కాగా ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో ఇప్పుడు మనం ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
విక్టోరియా హౌస్ లో దెయ్యాలు ఉన్నాయని.. అక్కడికి వెళ్లిన వారందరూ చనిపోతున్నారని తెలుసుకుంటున్నారు కొంతమంది ఘోస్ట్ హంటర్స్. దానితో నలుగురు ఘోస్ట్ హంటర్స్ ( అభినవ్, అభిషేక్, పూర్ణిమ, పావని) అక్కడకి వెళ్లి ఘోస్ట్స్ ఉన్నాయని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు. అక్కడికి వెళ్లిన వారికి కొన్ని భయానక వింత అనుభవాలు ఎదురవుతాయి. అంతేకాదు ఆ విక్టోరియా హౌస్ లో ఉండే ఇద్దరు అక్కాచెల్లెల్లు జెస్సీ (అష్మిత నర్వాల్), యమి (శ్రీత చందన) కథ తెలుస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది.? ఆ ఘోస్ట్ హంటర్స్ ఏమి అయ్యారు.? అనేది మిగతా కథ.
నటీనటులు :
‘జెస్సీ’ గా ప్రధాన పాత్రలో నటించిన అష్మిత నర్వాల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందనే చెప్పాలి. చక్కని నటన.. హావభావాలతో ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన అతుల్ కులకర్ణి ఎప్పటిలానే తన పాత్రలో జీవించారు. శ్రీత చందన, పూర్ణిమ, పావని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కని నటన కనబరిచారు.
విశ్లేషణ :
మనుషులు చనిపోయిన తర్వాత వారు ఆత్మలుగా మారతారా.? అసలు దెయ్యాలు అనేవి ఉన్నాయా.? వాటి వల్ల ఆపదలు వస్తాయా. ? అనే పాయింట్ ను ఘోస్ట్ హంటర్స్ తో ముడి పెట్టి దర్శకుడు అశ్వని కుమార్ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో దర్శకుడు మంచి ప్రతిభను కూడా కనబరిచాడనే చెప్పాలి. అయితే ఆయన రాసుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. కథ, కథనాలు మరీ విభిన్నంగా ఉండడం.. దానికి తోడు సెకండ్ హాఫ్ లో ఫ్లో మిస్ అవ్వడంతో ప్రేక్షకులు చాలా చోట్ల బోర్ ఫీల్ అవుతారు. అంతేకాదు ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలను కన్వీన్స్ గా చెప్పడంలో దర్శకుడు పూర్తిగా విఫలమైయ్యాడు.
సాంకేతిక విభాగాల పనితీరు:
ఇక సాంకేతిక విభాగాల పనితీరు అంతంత మాత్రమే అనిచెప్పవచ్చు. ఈ సినిమాలో కెమెరా వర్క్ బాగుంది. ముఖ్యంగా హారర్ సన్నివేశాల్లో కెమెరా పనితనం చాలా బాగుంది. ఎడిటింగ్ ఓకే. సంగీతం కూడా ఆకట్టుకుంది. ఇక నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ప్రధాన నటులు
సంగీతం
అష్మిత నర్వాల్ నటన
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్
ఎడిటింగ్