‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ మూవీ రివ్యూ
టైటిల్ : వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ జానర్ : కామెడీ హారర్ తారాగణం : రాయ్ లక్ష్మీ, ప్రవీణ్, మధు నందన్, రామ్ కార్తీక్, పూజితా పొన్నాడ సంగీతం : హరీ గౌర దర్శకత్వం : కృష్ణ కిశోర్ నిర్మాత : శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి ఖైదీ నెం.50 చిత్రంలో రత్తాలు.. రత్తాలు ఐటమ్ సాంగ్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ చిత్రంతో […]
టైటిల్ : వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ జానర్ : కామెడీ హారర్ తారాగణం : రాయ్ లక్ష్మీ, ప్రవీణ్, మధు నందన్, రామ్ కార్తీక్, పూజితా పొన్నాడ సంగీతం : హరీ గౌర దర్శకత్వం : కృష్ణ కిశోర్ నిర్మాత : శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి
ఖైదీ నెం.50 చిత్రంలో రత్తాలు.. రత్తాలు ఐటమ్ సాంగ్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని సూపర్ హిట్స్‌ను ఇచ్చి అదే ఫార్మాట్‌లో మూస చిత్రాల రావడంతో కాస్త వెనబడిన జానర్ కామెడీ హార్రర్. కొంత గ్యాప్ తరువాత ఇదే జానర్‌లో మరోసారి వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ వెంకటలక్ష్మీ ప్రేక్షకులను ఏమేరకు నవ్వించిందా? భయపెట్టిందా?…అప్పడప్పుడు భయపెడుతూ ఫుల్‌గా నవ్వించిందా? డిటేల్స్ ఈ రివ్యూలో చూద్దాం.
కథ : చంటిగాడు (ప్రవీణ్), పండుగాడు (మధు నందన్) బెల్లంపల్లి అనే ఊళ్లో సాదా సీదా తిరుగుతూ జాల్సా చేసే కుర్రాళ్లు. ఊళ్లో జనాలను ఇబ్బంది పెడుతూ ఆనందపడే చంటి , పండు…ఓన్లీ శేఖర్ (రామ్ కార్తీక్) మాట మాత్రం వింటారు. వారికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా శేఖరే దగ్గరుంచి పరిష్కరిస్తుంటాడు.కానీ గౌరీ(పూజితా పొన్నాడ) ప్రేమ విషయంలో చంటి, పండు చేసిన పని కారణంగా శేఖర్ కూడా వారిని అసహ్యించుకుంటాడు. అదే సమయంలో బెల్లంపల్లి ఊరికి స్కూల్ టీజర్‌గా వెంకటలక్ష్మి( రాయ్ లక్ష్మీ) వస్తుంది. బస్ దిగగానే సాయం చేయమని చంటి, పండులను అడుగుతుంది. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న చంటి, పండు వెంకటలక్ష్మికి కావాల్సిన అన్ని వసతులను దగ్గరుండి చూసుకుంటారు.మాఫియా నాయకుడు ఓ పెట్టే కోసం ఓ ఆడిటర్ (బ్రహ్మాజీ) కుటుంబాన్ని చంపేస్తాడు.చంటి, పండులను మచ్చిక చేసుకొని మాఫియా నాయకుడు ఇంట్లోని పెట్టెను తీసుకురమ్మని వెంకటలక్ష్మీ వేధిస్తుంది. అసలు దెయ్యంగా వచ్చిన వెంకటలక్ష్మీ ఎవరు..? వెంకటలక్ష్మి.. చంటి, పండులకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? అసలు వెంకటలక్ష్మి చనిపోవడానికి కారణాలలేంటి? ఆ పెట్టె కోసం ఎందుకు వారిని వేధించింది లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూశేయాల్సిందే.
నటీనటులు : ఇక కాస్త సన్నబడ్డ బొద్దు గుమ్మ రాయ్ లక్ష్మీ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. భయపెట్టే సన్నివేశాలతో పాటు స్కిన్ షో తోనూ ఆకట్టుకుంది. ఆవిడ నుంచి పెర్ఫామెన్స్ తీసుకోవాలా? గ్లామర్‌ను వాడుకోవాలా అన్న మీమాంసలో దర్శకుడు కాస్త కన్‌ఫ్యూజ్ అయ్యాడు. ప్రవీణ్, మధునందన్‌లు తమ పరిధి యాజ్ యూజువల్‌గా బాగానే నటించారు. అయితే కొన్ని చోట్ల వీరి కామెడీ రోటీన్‌గా.. బోర్‌గా అనిపిస్తుంది. నటుడు రామ్ కార్తీక్ పరిధిమేర బాగా నటించాడు. పూజితా పొన్నాడ కూడా ఈజ్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో అన్నపూర్ణ, మహేష్, బ్రహ్మాజీ తమ పాత్రలకు తగ్గట్టుగా సినిమాకు నిండుదనాన్ని తీసుకువచ్చారు.
విశ్లేషణ : ఇంట్రస్టింగ్ పాయింట్ తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు కిశోర్, తరువాత అదే స్థాయిలో కథను నడిపించలేకపోయాడు. కామెడీ హర్రర్ సినిమాలంటే కాస్త మాస్ కామెడీ, కొన్ని రొమాంటిక్ సీన్లు, కాస్త భయపెట్టే రెగ్యులర్ మూస ధోరణిలోనే దర్శకుడు ఆలోచించినట్టు అర్థమైపోతుంది. ఎక్కువగా అడల్ట్ కామెడీ మీద దృష్టి పెట్టి యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన దర్శకుడు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు పూర్తిగా దూరమయ్యాడు. కథా కథనాలు కూడా ఆసక్తికరంగా సాగకపోవటం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. వెంకటలక్ష్మి దెయ్యం అని రివీల్ అయిన తరువాత కథ ఆసక్తికరంగా మారుతుందని భావించిన ప్రేక్షకుడిని మరింత నిరాశకు గురిచేశాడు దర్శకుడు. క్లైమాక్స్ మరీ నాటకీయంగా ముగియటం ఆడియన్స్‌కు రుచించటం కష్టమే.
సాంకేతిక విభాగాల పనితీరు: ఇక సాంకేతిక విభాగాల పనితీరు అంతంత మాత్రమే అనిచెప్పవచ్చు. వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి చిత్రంలో కాస్త పాజిటివ్‌గా అనిపించేది హరిగౌర మ్యూజిక్. ఓ రొమాంటిక్ పాట బాగుంది. గోదావరి తీర అందాలను అద్బుతం అనిపించేలా సినిమాటోగ్రఫి ఉంది. కత్తెరకు ఇంకాస్త పొదును పెట్టి ఉంటే ఫలితం బెటర్‌గా ఉండేదెమో. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. నిర్మాతలు శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టాల్సింది.
ప్లస్ పాయింట్స్ : రాయ్ లక్ష్మి సంగీతం రామ్ కార్తీక్ నటన
మైనస్ పాయింట్స్ : కథా, కథనం దర్శకత్వం ఎడిటింగ్