AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seetimaarr Movie Review: సెన్సిటివ్‌ ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్‌ సినిమా సీటీమార్‌..!

Seetimaarr Review: మామూలుగానే ఫెస్టివ్‌ సీజన్‌ అంటే సినిమా థియేటర్ల కళ మామూలుగా ఉండదు. అలాంటిది కోవిడ్‌ తర్వాత జనాల్లో భయం పోయి థియేటర్ల వైపు అడుగులు..

Seetimaarr Movie Review: సెన్సిటివ్‌ ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్‌ సినిమా సీటీమార్‌..!
Seetimaarr
Ravi Kiran
|

Updated on: Sep 10, 2021 | 3:56 PM

Share

మామూలుగానే ఫెస్టివ్‌ సీజన్‌ అంటే సినిమా థియేటర్ల కళ మామూలుగా ఉండదు. అలాంటిది కోవిడ్‌ తర్వాత జనాల్లో భయం పోయి థియేటర్ల వైపు అడుగులు పడుతున్న ఈ టైమ్‌లో రిలీజ్‌ అయిన సెన్సిటివ్‌ సేమ్‌ టైమ్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ సీటీమార్‌. ఈ సినిమా ఎలా ఉంది? జనాలకు నచ్చుతుందా? లేదా? చదివేయండి.

సినిమా: సీటీమార్‌

నటీనటులు: గోపీచంద్‌, తమన్నా, దిగంగనా సూర్యవంశీ, భూమిక చావ్లా, రెహమాన్‌, రావు రమేష్‌, తరుణ్‌ అరోరా, పోసాని కృష్ణమురళి, రోహిత్‌ పాథక్‌, అంకుర్‌ సింగ్‌ తదితరులు

నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి

సమర్పణ: పవన్‌ కుమార్‌

రచన – దర్శకత్వం: సంపత్‌ నంది

సంగీతం: మణిశర్మ

ఎడిటర్‌: తమ్మిరాజు

కెమెరా: సౌందర్‌రాజన్‌

కొరియోగ్రఫీ: శోభి, ప్రేమ్‌రక్షిత్‌

స్టంట్స్: స్టంట్‌ శివ, వెంకట్‌, రియల్‌ సతీష్‌, స్టంట్‌ జాషువా

విడుదల: ఏప్రిల్‌ 2, 2021

కథ:

గోపీచంద్‌ రూరల్‌ ఏరియాలో బ్యాంకులో పనిచేస్తుంటాడు. సాయంత్రం ఐదు దాటిన తర్వాత అక్కడి చుట్టుపక్కల ఆడ పిల్లలందరినీ చేరదీసి కబడ్డీ నేర్పిస్తుంటాడు. ఎలాగైనా అతను ట్రైనింగ్‌ ఇచ్చిన ఆంధ్రా టీమ్‌ నేషనల్‌ లెవల్లో కప్‌ కొట్టాలన్నది అతని ఎయిమ్‌. వెల్‌ సెటిల్డ్ ఫ్యామిలీకి చెందిన అతను… అంతగా కబడ్డీ మీద ఎందుకు ఫోకస్‌ పెట్టాల్సి వచ్చిందనడానికీ ఓ కారణం ఉంటుంది.

తన టీమ్‌తో ఢిల్లీ పోటీలకు చేరుకున్న అతనికి అక్కడ తెలంగాణ టీమ్‌ కోచ్‌ జ్వాలారెడ్డి కనిపిస్తుంది. వారిద్దరికీ ఆల్రెడీ ఫ్లాష్‌ బ్యాక్‌ ఉంటుంది. అదేంటన్నది ఆసక్తికరం. ఢిల్లీలో అతను ఫేస్‌ చేసిన ఓ ప్రాబ్లమ్‌కీ, అతని బావ అరవింద్‌కీ ఏంటి లింకు? మాంకత్‌, త్రిలోక్‌ ఎవరు? అక్కతో గోపీచంద్‌కి ఉన్న అనుబంధం ఎలాంటిది? మధ్యలో పెప్సీ ఆంటీ రోల్‌ ఏంటి? ఇలాంటివన్నీ సీటీమార్‌లో ఇంట్రస్టింగ్‌ ఎలిమెంట్స్..

విశ్లేషణ:

యాక్షన్‌ సినిమాలు గోపీచంద్‌కి కొత్త కాదు. ఇన్‌స్పయిరింగ్‌ వన్‌ లైనర్స్ కూడా కొత్త కాదు. స్క్రీన్‌ మీద మంచి టోన్‌తో డైలాగులు చెప్పగలిగిన హీరోల్లో ఇప్పటికీ ముందు వరుసలో ఉంటారు గోపీచంద్‌. ఈ సినిమాలోనూ ఆయనతో అలాంటి డైలాగులు చాలానే చెప్పించే ప్రయత్నం చేశారు డైరక్టర్‌ సంపత్‌ నంది. గోపీచంద్‌ అక్కగా భూమిక, బావ ఐపీయస్‌ ఆఫీసర్‌గా రెహమాన్‌ బాగా చేశారు. తమన్నా తెలంగాణ స్లాంగ్‌ని ఈజ్‌తో డెలివర్‌ చేశారు. గోపీచంద్‌ తల్లిగా ప్రగతి అండ్‌ బ్యాచ్‌, అదే ఊరి పెద్దగా రావు రమేష్‌ ఫస్టాఫ్‌లో కాస్త రిలీఫ్‌. నార్త్ విలన్‌ బ్యాచ్‌, వాళ్లకు తగ్గట్టు లొకేషన్లు అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్‌ అయ్యాయి.

పద్ధతి అమ్మాయిల డ్రస్సులో ఉండదు , మన దేశంలో మగవాళ్లు 60 ఏళ్లు బతుకుతున్నారు.ఆడవాళ్లు కూడా 60 ఏళ్లు బతుకుతున్నారు. కానీ 20 ఏళ్లకే మానసికంగా చనిపోతున్నారు. వాళ్లని 20 ఏళ్లకే చంపేద్దామా…. లైఫ్‌లో ఫస్ట్ రావాలంటే ఫస్టే రావాలి… రాజధానిలో అమ్మాయిలకే భద్రత లేదు, ఇక మన ఊరి ఆడపిల్లల్ని అక్కడికి పంపడం ఎందుకు? వంటి డైలాగులు మెప్పిస్తాయి.

పరపతి గల కుటుంబం, తమ తండ్రి కట్టించిన స్కూల్‌ని కాపాడుకోవడానికి ఇంత కష్టపడాలా? అని ఆడియన్‌కి ఓ క్వశ్చన్‌ రెయిజ్‌ అవుతుంది. అయితే దానికీ లాజిక్కు బానే చూపించారు డైరక్టర్‌. మరీ కొత్త కథ కాదు. అలాగని బోర్‌ కొట్టించేంత రొడ్డకొట్టుడు సినిమా కాదు. కమర్షియల్‌ ఫార్మాట్‌కి కావాల్సిన అన్ని విషయాలను ఇంక్లూడ్‌ చేసి ప్రెజెంట్‌ చేశారు సంపత్‌ నంది. ఈ ఫెస్టివ్‌ సీజన్‌లో జనాలను థియేటర్లకు తీసుకురావడానికి కావాల్సిన హంగులన్నీ ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

షూటింగ్‌ లొకేషన్లు, రైల్వే స్టేషన్‌లో రౌడీ గ్యాంగ్‌కి తమన్నా ఇచ్చే ఝలక్‌ , మణిశర్మ ట్యూన్లు, కెమెరా వర్క్… చెప్పుకోదగ్గ విషయాలు చాలానే ఉన్నాయి.

ఫైనల్ మాట:

సెన్సిటివ్‌ ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్‌ సినిమా సీటీమార్‌. టైటిల్‌కి జస్టిఫికేషన్‌లాగా థియేటర్లలో అక్కడక్కడా విజిల్స్ బాగానే పడుతున్నాయి

– డా. చల్లా భాగ్యలక్ష్మి