Jacqueline Fernandez: చాలా మిస్సవుతున్నా మై బేబీ.. బాలీవుడ్ బుట్టబొమ్మకు జైలు నుంచి ఖైదీ ప్రేమలేఖ..

‘‘మై బేబీ జాక్వెలిన్‌. నా పుట్టినరోజున నిన్ను చాలా మిస్‌ అవుతున్నా. నీ మాటలను, నీ ఎనర్జీని ఎంతగానో మిస్‌ అవుతున్నా. కానీ, నా మీద నీకున్న ప్రేమ అనంతమైనదని, ఎన్నటికీ తరగనిదని నాకు తెలుసు.

Jacqueline Fernandez: చాలా మిస్సవుతున్నా మై బేబీ.. బాలీవుడ్ బుట్టబొమ్మకు జైలు నుంచి ఖైదీ ప్రేమలేఖ..
Jacqueline Fernandez Sukesh
Follow us

|

Updated on: Mar 26, 2023 | 8:52 AM

నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఆర్థిన నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌ మరోసారి ప్రేమ సందేశాన్ని పంపాడు. మహా మాయగాడు.. సుకేశ్ చంద్రశేఖర్‌ తన బుట్టబొమ్మ జాక్వెలిన్‌కి ప్రేమలేఖ రాయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ‘‘మై బేబీ జాక్వెలిన్‌. నా పుట్టినరోజున నిన్ను చాలా మిస్‌ అవుతున్నా. నీ మాటలను, నీ ఎనర్జీని ఎంతగానో మిస్‌ అవుతున్నా. కానీ, నా మీద నీకున్న ప్రేమ అనంతమైనదని, ఎన్నటికీ తరగనిదని నాకు తెలుసు. నీ అందమైన హృదయంలో ఏముందో నాకు బాగా తెలుసు. దానికి రుజువులు అక్కర్లేదు. నా జీవితంలో వెలకట్టలేని అత్యంత విలువైన కానుక నువ్వు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా బుట్టబొమ్మ’’ అని సుకేశ్ ఆ లేఖలో రాసుకొచ్చాడు. కాగా.. ఇటీవల హోలీ సందర్భంగా సుకేశ్.. నటిజాక్వెలిన్‌కి ఇలాంటి ప్రేమ సందేశాన్నే పంపారు.

వందల కోట్ల రూపాయల మనీలాండరింగ్‌కి పాల్పడ్డ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ నుంచి జాక్వెలిన్‌కు అందిన ఖరీదైన బహుమతులపై కథలు కల్లోలం రేపాయి. ఈడీ దర్యాప్తులో ఆమెను నిందితురాలిగా పేర్కొంది. అయితే సుకేశ్ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని జాక్వెలిన్‌ స్టోరీలు కూడా వినిపించింది. తన కెరీర్‌ను, జీవనోపాధిని సర్వనాశనం చేశాడంటూ సుకేశ్‌పై దుమ్మెత్తిపోసింది. కోర్టు ఎదుట కూడా అదే విషయాన్ని నొక్కి చెప్పింది. హోంశాఖలో ఓ ముఖ్య అధికారిగా సుఖేశ్‌ తనను తాను పరిచయం చేసుకున్నట్లు వెల్లడించింది.

ఎక్కడి నుంచో కాదు. ఏకంగా జైలు నుంచే అక్రమాలకు పాల్పడిన ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌ తన సన్నిహతురాలు, సినీ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కు మరో ప్రేమ లేఖ రాశాడు. సుకేశ్ తన పుట్టినరోజు సందర్భంగా జైలు నుంచే ఆమెకు ఈ సందేశాన్ని పంపాడు. నటిపై తనుకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ అతడు రాసిన ఈ లేఖ వార్త ఇప్పుడు జాతీయ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..