Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగా అభిమానులకు ఇక పూనకాలే.. రీరిలీజ్ కాబోతున్న చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’‌.. డేట్ కూడా ఫిక్స్..

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో యువ నటీనటులకు స్ఫూర్తిగా నిలిచిన చిరంజీవి సినిమా వస్తుందంటే చాలామందికి..

Chiranjeevi: మెగా అభిమానులకు ఇక పూనకాలే.. రీరిలీజ్ కాబోతున్న చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’‌.. డేట్ కూడా ఫిక్స్..
Megastar Chiranjeevi's Gang Leader
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 01, 2023 | 7:00 AM

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో యువ నటీనటులకు స్ఫూర్తిగా నిలిచిన చిరంజీవి సినిమా వస్తుందంటే చాలామందికి పునకాలే. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినీప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా అందించిన సక్సెస్‌తో తన తర్వాతి మూవీని తెరకెక్కిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’ సినిమాలో చిరు నటిస్తున్నారు.

ఒకవైపు ఈ సినిమా షూటింగ్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, మరోవైపు చిరంజీవి నటించిన ఓ వింటేజ్ బ్లాక్‌బస్టర్ మూవీని రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర వర్గాలు సిద్ధమవుతున్నాయి. చిరంజీవి, విజయశాంతి జంటగా.. విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్‌లీడర్’ మెగాస్టార్‌ మాస్ ఇమేజ్‌ను పటిష్టం చేసిన  సినిమా. ‘చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో! రఫ్ ఆడించేస్తాను’ అంటూ మెగాస్టార్ చెప్పే మాస్ డైలాగ్‌లను ప్రేక్షకుల ముందుకు మరోసారి తీసుకురానున్నారు ‘భోళాశంకర్’ టీమ్. ఈ మేరకు టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా కూడా మారింది.

ఇవి కూడా చదవండి

1991లో విడుదలైన ఈ సెన్సేషనల్ మూవీని ఈ ఏడాది ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు మరో సారి రానుంది. దీంతో మరోసారి వింటేజ్ చిరంజీవిని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాకు బప్పీ లహరి సంగీతం ఎలాంటి సక్సెస్‌ను అందజేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో కైకాలసత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, శరత్ కుమార్, మురళీమోహన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ నేపథ్యంలో మన మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద ‘గ్యాంగ్‌లీడర్’గా మళ్లీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.