Sye Raa: స్వాతంత్య్ర దినోత్సవ కానుక సిద్ధం.. మెగా ఫ్యాన్స్ గెట్‌ రెడీ

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు మూవీ యూనిట్ సిద్ధమైంది. ఈ క్రమంలో ఆగష్టు 14న సైరా మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే గతేడాది ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లగా.. ఇప్పటివరకు పలువురి లుక్‌లు, ఒక టీజర్‌ […]

Sye Raa: స్వాతంత్య్ర దినోత్సవ కానుక సిద్ధం.. మెగా ఫ్యాన్స్ గెట్‌ రెడీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2019 | 4:45 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు మూవీ యూనిట్ సిద్ధమైంది. ఈ క్రమంలో ఆగష్టు 14న సైరా మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

అయితే గతేడాది ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లగా.. ఇప్పటివరకు పలువురి లుక్‌లు, ఒక టీజర్‌ మాత్రమే విడుదలైంది. ఇప్పుడు విడుదల తేదికి ముహూర్తం ఫిక్స్ చేయడంతో.. ప్రమోషన్లలో వేగం పెంచింది సైరా టీమ్. ఈ నేపథ్యంలో ఆగష్టు 15 కానుకగా మేకింగ్ వీడియోను విడుదల చేయనున్న దర్శకనిర్మాతలు.. ఈ నెల 22న చిరు పుట్టినరోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కాగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన నయనతార నటించగా.. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, రవి కిషన్, తమన్నా, అనుష్క, నిహారిక తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మించిన ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. అమిత్ త్రివేది సంగీతం అందించాడు. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్‌ కావడం, భారీ తారాగణం నటించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.