బర్నింగ్ స్టార్ పెద్ద మనసు..వరద బాధితులకు సాయం

దేశ వ్యాప్తంగా వానలు విపరీతంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు తోడవడంతో కొన్ని గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. సహాయక చర్యల్లో అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. వరదల నష్టపోయిన వరద భాదితులను ఆదుకునేందుకు కొందరు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు . ఇక టాలీవుడ్ నుండి  సంపూర్ణేష్ బాబు ముందడుగు వేశారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో బర్నింగ్ స్టార్ ఎప్పుడూ ముందుంటాడు. తనకు వచ్చిన దాంట్లో ఎంత కొంత […]

బర్నింగ్ స్టార్ పెద్ద మనసు..వరద బాధితులకు సాయం
Burning Star
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 13, 2019 | 8:33 PM

దేశ వ్యాప్తంగా వానలు విపరీతంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు తోడవడంతో కొన్ని గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. సహాయక చర్యల్లో అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. వరదల నష్టపోయిన వరద భాదితులను ఆదుకునేందుకు కొందరు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు . ఇక టాలీవుడ్ నుండి  సంపూర్ణేష్ బాబు ముందడుగు వేశారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో బర్నింగ్ స్టార్ ఎప్పుడూ ముందుంటాడు. తనకు వచ్చిన దాంట్లో ఎంత కొంత డబ్బును సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటాడు.

‘ఉత్తర కర్ణాటకలో వరదలు నన్ను కలిచివేసింది. కన్నడ ప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా హృదయకాలేయం నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫోటోలు చూసి చాలా బాధవేసింది. నా వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటిస్తున్నాను’ అని సంపూ ట్వీట్ చేశాడు. కాగా బర్నింగ్ మంచి మనసును పలువురు నెటిజన్లు కొనియాడుతున్నారు.