AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మహర్షి’ సూపర్: మెగాస్టార్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి చిత్రం థియేటర్లలో దూసుకుపోతోంది. గురువారం విడుదలైన ఈ మూవీకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్లలోనూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో ఉబ్బితబ్బిబ్బౌతున్న మహర్షి టీం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్.. మెగాస్టార్ చిరంజీవికి థ్యాంక్స్ చెప్పారు. ఈ మూవీ చిరంజీవి గారికి చాలా నచ్చిందని.. ముుఖ్యంగా చిత్రంలోని వీకెండ్ అగ్రికల్చర్ కాన్సెప్ట్‌ ఆయనను బాగా మెప్పించిందని తెలిపారు. అలాగే మూవీలో మహేశ్ […]

‘మహర్షి’ సూపర్: మెగాస్టార్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 10, 2019 | 1:01 PM

Share

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి చిత్రం థియేటర్లలో దూసుకుపోతోంది. గురువారం విడుదలైన ఈ మూవీకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్లలోనూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో ఉబ్బితబ్బిబ్బౌతున్న మహర్షి టీం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్.. మెగాస్టార్ చిరంజీవికి థ్యాంక్స్ చెప్పారు.

ఈ మూవీ చిరంజీవి గారికి చాలా నచ్చిందని.. ముుఖ్యంగా చిత్రంలోని వీకెండ్ అగ్రికల్చర్ కాన్సెప్ట్‌ ఆయనను బాగా మెప్పించిందని తెలిపారు. అలాగే మూవీలో మహేశ్ రైతుగా నటించడాన్ని చిరంజీవి అభినందించారని డీఎస్పీ వెల్లడించారు. ఇక దర్శకుడ వంశీ పైడిపల్లి కూడా ఈ సందర్భంగా మెగాస్టార్‌కి థ్యాంక్స్ చెప్పారు.