ఆ సినిమా చూస్తూ ఏడ్చేసాను.. ఆమె చీర నా చేతిలో.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన మెగాస్టార్..
అక్కినేని సమంత వ్యాఖ్యతగా ఆహా ఓటీటీలో నిర్వహిస్తున్న ఛాట్ షో సామ్ జామ్ గురించి తెలిసిందే. ఇప్పటికే ఇందులో పలువురు సెలబ్రెటీలు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని ఎన్నో
అక్కినేని సమంత వ్యాఖ్యతగా ఆహా ఓటీటీలో నిర్వహిస్తున్న ఛాట్ షో సామ్ జామ్ గురించి తెలిసిందే. ఇప్పటికే ఇందులో పలువురు సెలబ్రెటీలు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియజేశారు. జేవీ సోమయాజులు ప్రధాన పాత్రలో మంజుభార్గవి, అల్లు రామలింగయ్య కీలకపాత్రల్లో నటించిన చిత్రం శంకరాభరణం. దర్శకుడు కె. విశ్వనాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా శంకరాభరణం సినిమా చూస్తూ తాను కన్నీళ్ళు పెట్టుకున్నానని చిరంజీవి తెలిపారు.
కోతలరాయుడు సినిమాలో నాతో కలిసి పనిచేసిన మంజుభార్గవి కె.విశ్వనాథ్ గారు తెరకెక్కించిన శంకరాభరణం సినిమాలోనూ నటించింది. మంజుభార్గవికి నాతో ఉన్న పరిచయంతో ఆ సినిమా ప్రిమియర్ షోకు రమ్మని నన్ను ఆహ్వానించింది. అప్పటికింకా నాకు కె.విశ్వనాథ్, ఏడిద నాగేశ్వరరావుతో పరిచయం లేదు. అదే సమయంలో అల్లు రామలింగయ్య గారు కుటుంబ సమేతంగా సినిమా చూసేందుకు అక్కడికి వచ్చారు. ఆ సినిమా క్లైమాక్స్ సమయంలో నాకు కన్నీళ్ళు ఆగలేదు. అప్పుడు లైట్స్ ఆన్ చేస్తే నేను ఏడుస్తున్నాని అందరికి తెలిసిపోతుందని నా కర్చీఫ్ కోసం వెతుకుతున్నాను. అదే సమయంలో మంజుభార్గవి కన్నీళ్ళు తుడుచుకోమని నాకు తన చీర కొంగును అందించింది. నేను కన్నీళ్ళు తుడుచుకున్నానో లేదో సరిగ్గా అదే సమయానికి లైట్స్ ఆన్ అయ్యాయి. అప్పుడు మంజుభార్గవి చీర కొంగు నా చేతిలో ఉంది. చూసినవాళ్ళు ఏం అనుకున్నారో అనుకున్నాను అంటూ చిరంజీవి వివరించారు.