2020లో సమంతకు ఎంత కష్టం వచ్చిందో చూడండి.. అందరి అమ్మాయిలదీ ఇదే పరిస్థితి అంటోన్న అక్కినేని వారి కోడలు.
2020 సంవత్సరం కారణంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం కారణంగా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి, ఉద్యోగాలు పోయాయి, ఎన్నో రంగాలపై ప్రతికూల పరిస్థితులు పడ్డాయి. ఇదిలా ఉంటే...
samantha funny comments about 2020: 2020 సంవత్సరం కారణంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం కారణంగా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి, ఉద్యోగాలు పోయాయి, ఎన్నో రంగాలపై ప్రతికూల పరిస్థితులు పడ్డాయి. ఇదిలా ఉంటే 2020 మిగిల్చిన మరో నష్టాన్ని సమంత అభిమానులతో పంచుకుంది. అయితే సమంత చెప్తోన్న ఈ నష్టం ఇప్పుడు నెటిజెన్లను నవ్విస్తోంది.. రకరకాల అవుట్ ఫిట్స్‌లో దిగిన ఫొటోలన్నింటితో కూడిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సమంత. ఈ వీడియోలో.. ‘నేను ఈ ఏడాది చాలా రకాల కొత్త డ్రస్‌లను ధరించాలని ప్రణాళికలు వేసుకున్నాను.. కానీ కుదరలేదు’ అనే వాయిస్ ఓవర్ వినిపిస్తోంది. అంటే… కరోనా కారణంగా కార్యక్రమాలన్నీ వాయిదా పడడంతో కొత్త డ్రస్‌లు ధరించే అవకాశం రాలేదనేది సామ్ ఉద్దేశం. ఈ వీడియోతో పాటు 2020లో ప్రతీ అమ్మాయి పరిస్థితి ఇదేనని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ‘ఆహా’ ఓటీటీ కోసం వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న సామ్.. ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సిరీస్‌తో పాటు తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది.
View this post on Instagram