AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కళ్యాణ్ పర్మిషన్ తోనే ఆ సినిమా చేశా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన డైరెక్టర్ క్రిష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత పవన్ దర్శకుడు క్రిష్ తో సినిమా చేయాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ పర్మిషన్ తోనే ఆ సినిమా చేశా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన డైరెక్టర్ క్రిష్
Rajeev Rayala
|

Updated on: Dec 25, 2020 | 4:17 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత పవన్ దర్శకుడు క్రిష్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ మధ్యపవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు క్రిష్. ఈ సినిమా కోహినూర్ వజ్రం నేపథ్యంలో సాగుతుందని, ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని మొదటినుంచి ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మధ్య క్రిష్-పవన్ సినిమా గురించి ఎక్కడా పెద్దగా వార్తలు రావడంలేదు. సినిమా పైన అటు పవన్, ఇటు క్రిష్ కూడా సైలెంట్ గా ఉండటంతో ఈ సినిమాను పక్కన పెట్టారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక పవన్ వరుసగా వేసే సినిమాలు కమిట్ అవుతున్న నేపథ్యంలో క్రిష్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమాను తెరకెక్కించాడు. కేవలం 60 రోజుల సమయంలో ఈ సినిమాను తెరకెక్కించాడు క్రిష్. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అయితే  పవన్ సినిమాను ఎందుకు పక్కన పెట్టారు అన్నదానిపై క్లారిటీ ఇచ్చాడు క్రిష్. తాజాగా సమంత నిర్వహిస్తున్న టాక్ షోకు హాజరైన క్రిష్ అసలు విషయాన్ని బయట పెట్టారు. పవన్ కళ్యాణ్ పర్మిషన్ తోనే సినిమాను పక్కన పెట్టానని, ఈ  గ్యాప్ లో వైష్ణవ్ తేజ్ తో సినిమా చేసినట్టు తెలిపాడు క్రిష్. పవన్ అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందువల్లే వకీల్ సాబ్ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ గ్యాప్ లో క్రిష్ ఆ సినిమాలు కంప్లీట్ చేశారు. ఇక పవన్ సినిమాను కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేస్తానని గతంలో చెప్పారు క్రిష్ ఇప్పుడు సమంత షోలోనూ.. అదే విషయాన్ని చెప్పుకొచ్చారు క్రిష్.

తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో