AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi : పెద్ది సెన్సార్ టాక్..! థియేటర్స్ తగలబడిపోవడమే.. ఫ్యాన్స్ గెట్ రెడీ

మెగా ఫ్యాన్స్, టాలీవుడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి .

Peddi : పెద్ది సెన్సార్ టాక్..! థియేటర్స్ తగలబడిపోవడమే.. ఫ్యాన్స్ గెట్ రెడీ
Peddi
Rajeev Rayala
|

Updated on: May 18, 2026 | 12:37 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ లాంటి డిస్సప్పాయింట్ సినిమా తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అంతేకాదు బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఉప్పెన లాంటి లవ్ స్టోరీతో వందకోట్లకు పైగా రాబట్టిన బుచ్చిబాబు.. ఇప్పుడు పెద్ది సినిమాతో బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను నేడు విడుదల చేయనున్నారు.

ఇది కూడా చదవండి :చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. గర్వంగా ఉందన్న రోజా

ఈ సినిమా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు (18న ) ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. అలాగే శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అదేవిధంగా మరికొంతమంది స్టార్ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ పోస్టర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి: ఆ స్టార్ హీరో హలీం వండితే పండగే.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే

ఇదిలా ఉంటే తాజాగా పెద్ది సినిమానా సెన్సార్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. కాగా పెద్ది సినిమా రన్ టైం ఏకంగా 3 గంటల 9 నిముషాలు ఉందని తెలుస్తుంది. ఏకంగా ఈ సినిమా ఏకంగా 189 నిమిషాల రన్ టైం తో సాగనుంది. అలాగే గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పెద్ది సినిమాలో ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉండనున్నాయట.. ముఖ్యంగా చరణ్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయం అంటున్నారు. విజయనగరం యాసలో చరణ్ చెప్పే డైలాగ్స్, ఆయన ఊర మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా క్రికెట్, రెజ్లింగ్ సీన్స్ ముఖ్యంగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తాని అంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :అతను ఎంతో గొప్పనటుడు నటుడు.. ఆ హీరోకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!