Krack Movie Success Meet: మాస్ మహారాజ్ ఈజ్ బ్యాక్.. ‘క్రాక్’ టీం సక్సస్ మీట్.. లైవ్ వీడియో..
Krack Movie Success Meet: మాస్ మహారాజా రవితేజ, శృతీహాసన్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘క్రాక్’...
Krack Movie Success Meet: మాస్ మహారాజా రవితేజ, శృతీహాసన్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘క్రాక్’. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న తరుణంలో రవితేజ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత భారీ విజయాన్ని అందుకున్న తొలి చిత్రంగా ఈ సినిమా సంచలనం సృష్టించింది. పోలీస్ పాత్రలో రవితేజ మరోసారి తన నటనా విశ్వరూపాన్ని చూపించాడు. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకెళుతోంది.
బీ,సీ సెంటర్లనే కాదు మల్టీప్లెక్స్‌ల్లోనూ మాస్ మహారాజా అభిమానుల చేత గోల పెట్టిస్తున్నాడు. పంచ్ డైలాగులు, సూపర్ హిట్ పాటలు, మాస్ ఫైట్‌లతో ఫుల్ మీల్స్ భోజనంలా ఉన్న ఈ సినిమా ఇంకా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.ఇంతలా సక్సస్ అయింది కాబట్టే మన క్రాక్ టీం సక్సస్ మీట్‌ను కూడా భారీగా ప్లాన్ చేసింది. సినిమాను ఫన్‌ఫుల్ హిట్‌తో నెక్ట్స్ లెవల్‌కు తీసుకుపోయిన అభిమానులకు థాంక్యూ చెబుతూ.. ఈ ఈవెంట్‌లో రవితేజ సందడి చేస్తున్నారు. దానికి సంబంధించిన లైవ్ వీడియోను ఈ క్రింద లింక్ క్లిక్ చేసి చూడండి.