KGF Chapter 2 Teaser: చిక్కుల్లో ‘కేజీఎఫ్ 2’.. హీరో యష్‌కు నోటిసులు.. అసలు విషయమేమిటంటే.!
KGF Chapter 2 Teaser: రాకింగ్ స్టార్ యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం 'కేజీఎఫ్ 2'. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్..
KGF Chapter 2 Teaser: రాకింగ్ స్టార్ యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్ 2‘. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ 150 మిలియన్లకు చేరువలో ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ టీజర్ కారణంగా మొత్తం చిత్ర యూనిట్ చిక్కుల్లో పడింది. ‘కేజీఎఫ్ 2’ టీజర్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కర్ణాటక ఆరోగ్య శాఖ, యాంటీ టొబాకో సెల్ తాజాగా హీరో యష్‌కు నోటిసులు జారీ చేశారు. టీజర్‌లోని పొగ తాగే సన్నివేశాలు వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. ఆయా సీన్స్ టొబాకో చట్టంలోని సెక్షన్ 5 నిబంధనలను అతిక్రమిస్తున్నాయని యాంటీ టొబాకో సెల్ చెప్పింది.
”హీరో యష్ అభిమానుల్లో యువత అత్యధికం. టీజర్‌లోని పొగ తాగే సన్నివేశాల వల్ల వారు పెడదోవ పట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా క్యాన్సర్, ఊపిరితిత్తులకు సంబంధిత వ్యాధులు వస్తాయని” యాంటీ టొబాకో సెల్ హెచ్చరించింది. తక్షణమే టీజర్‌లోని పొగ తాగే సన్నివేశాలు, దానికి సంబంధించిన పోస్టరులు తొలగించాలంటూ హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిర్గాందర్‌కు ఆదేశాలు ఇస్తూ నోటిసులు పంపించింది.