Dr. Priya: మలయాళం సీరియల్ యాక్టర్ కన్నుమూత.. స్పందించిన సహ నటుడు
మలయాళీ సినీ పరిశ్రమలో విషాదాల గడియలు అలుముకున్నాయి. వరుసగా హీరోయిన్లు మరణిస్తున్నారు. మన్నటికి మన్న అపర్ణా పి. నాయర్ కాలం చేయగా, మరొక మలయాళీ ముద్దుగుమ్మ రెంజూషా మేనన్ కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది మల్లూవుడ్ సినీ పరిశ్రమ. వీరి ఇద్దరి మరణం మరువక ముందే మరో సీరియల్ నటి ప్రియ మృతి చెందారు. మంగళవారం రాత్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు ఆమెతో నటిస్తున్న యువ హీరో కిషోర్ సత్య వెల్లడించారు.

మలయాళీ సినీ పరిశ్రమలో విషాదాల గడియలు అలుముకున్నాయి. వరుసగా హీరోయిన్లు మరణిస్తున్నారు. మన్నటికి మన్న అపర్ణా పి. నాయర్ కాలం చేయగా, మరొక మలయాళీ ముద్దుగుమ్మ రెంజూషా మేనన్ కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది మల్లూవుడ్ సినీ పరిశ్రమ. వీరి ఇద్దరి మరణం మరువక ముందే మరో సీరియల్ నటి ప్రియ మృతి చెందారు. మంగళవారం రాత్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు ఆమెతో నటిస్తున్న యువ హీరో కిషోర్ సత్య వెల్లడించారు. ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆ చిత్ర పరిశ్రమతో పాటూ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
పెళ్లికి ముందు వరుస సీరియల్స్‌తో బిజీగా ఉండే ప్రియాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. తన గర్భంలో బిడ్డను మోస్తున్న క్రమంలో సాధారణ మెడికల్ టీట్మెంట్ కోసం ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఉన్న పళంగా కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడంతో అక్కడి వైద్య సిబ్బంది వెంటనే స్పందించారు. హుటాహుటిన ఆమె కడుపులో ఉన్న నవజాత శిశువును ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉందిన తెలిపారు డాక్టర్లు. ఎనిమిది నెలల పసికందును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ప్రియ నటి మాత్రమే కాదు డాక్టర్ విద్యను కూడా అభ్యసించారు. కరుతముత్తు అనే సీరియల్‌తో ఆమెకు మంచి పేరు వచ్చింది. పెళ్లి తరువాత సీరియల్స్‌కు కొంత దూరం ఉన్నారు.
35 ఏళ్ల వయసుకే ప్రియ మరణించడం తమ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. తల్లి తీవ్రంగా రోధిస్తున్నారు. భర్త ఆవేదనను, దుఖాన్ని ఎవరు తీర్చగలరని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కిషోర్ సత్య స్పందించారు.ఈ మొత్తం సంఘటనపై ఒక సందేశాన్ని జోడించారు. మంచివాళ్లకు దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో అని ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రియ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని రాసుకొచ్చారు. ఆమె మృతి పట్ల తోటి నటీమణులు విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని అందించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.