Dhanush: వెండితెరపై మ్యూజిక్ మ్యాస్ట్రో బయోపిక్.. ఇళయరాజా పాత్రలో కోలీవుడ్ స్టార్..
ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ గా వినిపిస్తోన్న టాక్ ప్రకారం ధనుష్ త్వరలో ఇళయరాజా బయోపిక్‌లో నటించనున్నాడట. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించి 2025లో ఈ సినిమాను విడుదల చేయనున్నారట. అంతేకాకుండా ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా సంస్థ నిర్మిస్తుందని సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఇళయరాజాతో ధనుష్ కలిసి ఉన్న ఫోటోస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

సార్ సినిమాతో తెలుగు, తమిళంలో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ధనుష్.. ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. శివరాజ్‌కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇక ధనుష్ తన 50వ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ గా వినిపిస్తోన్న టాక్ ప్రకారం ధనుష్ త్వరలో ఇళయరాజా బయోపిక్‌లో నటించనున్నాడట. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించి 2025లో ఈ సినిమాను విడుదల చేయనున్నారట. అంతేకాకుండా ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా సంస్థ నిర్మిస్తుందని సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఇళయరాజాతో ధనుష్ కలిసి ఉన్న ఫోటోస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి మ్యాస్ట్రో అనే టైటిల్ పరిశీలిస్తున్నారట.
మాస్ట్రో ఇళయరాజా ఐదు దశాబ్దాలకు పైగా సినీ ప్రపంచంలో తన సంగీతంతో సినీ ప్రియులను మెస్మరైజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 1000 కంటే ఎక్కువ సినిమాలు , 7000 పాటలు కంపోజ్ చేశారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత నాటక అకడమిక్ అవార్డు వంటి ఎన్నో అవార్డులను కూడా గెలుచుకున్న ఇళయరాజా ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఇళయరాజా తన పాటలతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు. 50 ఏళ్లలో 20 వేలకు పైగా కచేరీలు పూర్తి చేసిన ఏకైక సంగీత విద్వాంసుడు ఇళయరాజా. రజనీ, కమల్, చిరంజీవి, మెహన్ బాబు, బాలకృష్ణ వంటి అగ్రహీరోలకు ఎన్నో హిట్ సాంగ్స్ అందించాడు. గతంలో ఇళయరాజా బయోపిక్‌లో నటించేందుకు రజనీకాంత్ చర్చలు జరిపారని తెలుస్తోంది.
Glad to unveil the Tamil trailer of the movie “Ghost”! Sending my best wishes to @nimma shivanna and the entire team. Mark your calendars for its release on October 19th. 🎬 #GhostMovie #October19th
Tamil Trailerhttps://t.co/dr4k1BtXRG
“Big Daddy Of All Masses”#GhostTrailer… pic.twitter.com/Gv4rS0EpQ7
— Dhanush (@dhanushkraja) October 1, 2023
ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి వెట్రిమారన్‌ని సంప్రదించినట్లు సమాచారం. దీనికి ఆయన కూడా అంగీకరించినట్లు టాక్. వెటిమారన్ ప్రస్తుతం వితుత్య 2 సినిమా షూటింగ్‌లో ఉన్నారు. దీని తరువాత అతను చాలా సంవత్సరాలుగా నిలిపివేయబడిన వెటిమారన్-సూర్య జోడిలో వాడివాసల్ తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత తెలుగులో ఓ సినిమా, విజయ్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఈ అనూహ్య వార్త వెలువడినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
గతంలో ధనుష్‌తో కలిసి షమితాబ్‌లో పనిచేసిన బాలీవుడ్ చిత్ర దర్శకుడు ఆర్.బాల్కీ ఇటీవల సంగీత స్వరకర్త ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్‌ను నటింపజేయాలని తన కోరికను వ్యక్తం చేశాడు. పల్కీ గతంలో ఇళయరాజాతో కలిసి పనిచేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాల్కీ మాట్లాడుతూ.. ”ఇళయరాజా జీవిత చరిత్రను ధనుష్‌తో తీయాలనేది నా కల. గాయకుడిగా, గీత రచయితగా ధనుష్ బహుముఖ ప్రజ్ఞాశాలి’’ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.