B Harikumar: ఇండస్ట్రీని వెంటాడుతున్న వరుస విషాదాలు.. మరో నటుడు అకాల మరణం..
దిగ్గజ నటుడు కృష్ణ మరణవార్త ఇంకా మరువక ముందే గురువారం పంజాబీ నటి దల్జీత్ కౌర్ బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం పూర్తిచేశారు.
గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. జనవరిలో అన్నయ్య రమేష్ బాబును కోల్పోయిన మహేష్.. ఆ తర్వాత తల్లి ఇందిరా దేవి.. ఇటీవల తండ్రి కృష్ణను కోల్పోయారు. తల్లి, తండ్రి, అన్నయ్య ఇలా వరుసగా ఒకే ఏడాదిలో అందరూ దూరంకావడంతో మహేష్ దుఃఖంలో మునిగిపోయారు. దిగ్గజ నటుడు కృష్ణ మరణవార్త ఇంకా మరువక ముందే గురువారం పంజాబీ సినిమా నటి దల్జీత్ కౌర్ బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం పూర్తిచేశారు.
ఇక ఇప్పుడు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు.. రచయిత బి హరికుమార్ కన్నుమూశారు. మాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ కింగ్ గా పేరు తెచ్చుకున్న ఆయన గురువారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్లలు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆయన మృతి పట్ల మాలీవుడ్ సినీ ప్రముఖులు.. నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తిరువనంతపురంకు చెందిన హరికుమార్ మొదట బ్యాంకు అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత నటనపై మక్కువతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తన మేనమామ మాలీవుడ్ కమెడియన్ అదూర్ భాసీ సహకారంతో పలు చిత్రాల్లో నటించారు. హరికుమార్ మలయాళ సాహిత్య సర్కిల్లో చరుకుగా ఉన్నారు. నటుడిగానే కాకుండా రచయితగానూ గుర్తింపు తెచ్చుకున్నారు.