మజిలీ విడుదల పై క్లారిటీ..!
అక్కినేని నాగ చైతన్య, సమంతా జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరోహీరోయిన్లు ఇద్దరూ కూడా చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ఈ సినిమా సెన్సార్ ఆలస్యం వల్ల, లేదా రాజకీయ వాతావరణం వల్ల వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ […]

అక్కినేని నాగ చైతన్య, సమంతా జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరోహీరోయిన్లు ఇద్దరూ కూడా చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ఈ సినిమా సెన్సార్ ఆలస్యం వల్ల, లేదా రాజకీయ వాతావరణం వల్ల వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. వారి ట్విట్టర్ ద్వారా అధికారకంగా ఏప్రిల్ 5 న చిత్రం విడుదల అవుతుందని.. మీడియాలో ప్రచారం అయ్యే వార్తలు అన్ని అసత్యాలని తెలిపారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంతా కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇది. రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ టీజర్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి.
The emotional romantic entertainer #Majili coming to theatres on April 5th A film by @ShivaNirvana. @chay_akkineni @Samanthaprabhu2 @divyanshak10 @sahrudayg @harish_peddi #GopiSundar @VishnuSarmaDOP @sahisuresh #MajiliOnApr5th pic.twitter.com/Oc8vBv7lem
— Vishnu Thej Putta (@VishnuThejPutta) March 23, 2019