AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiru 152: మెగా హీరోలను చెర్రీ ఎందుకు వద్దనుకున్నాడు..!

తమ ఫ్యామిలీ గురించి బయట పుకార్లు చేసేవాళ్లు తమకు వెంట్రుకతో సమానం అంటూ ఆ మధ్యన మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కార్యక్రమంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎవరెన్నీ అనుకున్నా.. తమ ఫ్యామిలీ ఎప్పటికీ కలిసి ఉంటుందని చెర్రీతో పాటు మెగా హీరోలు కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.

Chiru 152: మెగా హీరోలను చెర్రీ ఎందుకు వద్దనుకున్నాడు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 28, 2020 | 10:17 AM

Share

తమ ఫ్యామిలీ గురించి బయట పుకార్లు చేసేవాళ్లు తమకు వెంట్రుకతో సమానం అంటూ ఆ మధ్యన మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కార్యక్రమంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎవరెన్నీ అనుకున్నా.. తమ ఫ్యామిలీ ఎప్పటికీ కలిసి ఉంటుందని చెర్రీతో పాటు మెగా హీరోలు కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అంతేకాదు ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అందరూ కలిసి ఫోజు ఇచ్చిన ఫొటోలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఫ్యామిలీ రిలేషన్‌ను పక్కనపెడితే.. సినిమాల విషయంలో మెగా హీరోలపై చెర్రీ అభిప్రాయమేంటన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇక అసలు విషయంలోకి వస్తే.. కొరటాల దర్శకత్వంలో చిరు(Chiranjeevi) నటిస్తోన్న 152వ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రామ్ చరణ్(Ram Charan) నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఓ కీలక పాత్రలో కూడా రామ్ చరణ్ నటించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన అది వర్కౌట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ఆ పాత్రలో మహేష్‌బాబు(Mahesh Babu) నటించనున్నారని.. దానికి సంబంధించి 30రోజుల డేట్లు కూడా ఇచ్చేశారని తెలుస్తోంది. అయితే చిరు సినిమాలో ఓ చిన్న పాత్రలోనైనా నటించేందుకు మెగా హీరోలందరూ ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్(Allu Arjun), సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), వరుణ్ తేజ్‌(Varun Tej)లు చాలా సార్లే చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఆ అవకాశం ఉంది. కావాలనుకుంటే కొరటాల సినిమాలో కీలక పాత్ర కోసం మెగా హీరోలనే సంప్రదించొచ్చు. మిగిలిన సినిమాల షూటింగ్‌ల్లో ఎంత బిజీగా ఉన్నా.. చిరు సినిమాలో పాత్ర అంటే వారు వద్దనే అవకాశం ఉండకపోవచ్చు. అంతేనా పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా రీ ఎంట్రీ ఇచ్చారు కాబట్టి.. ఈ చిత్రంలో పవన్ నటిస్తే.. ఆ ప్రాజెక్ట్‌కు భారీ క్రేజ్ కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కానీ అలా కాకుండా చరణ్, మహేష్‌ను ఎంచుకోవడానికి కారణమేంటన్న చర్చ జరుగుతోంది.

అయితే చరణ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఓ కారణమున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు మహేష్ అదనపు ఆకర్షణ అవ్వడంతో పాటు.. ఇరు ఫ్యాన్స్‌ల మధ్య సయోధ్య కూడా పెరిగే అవకాశం ఉంది. దీని ద్వారా తామంతా ఒకేటనని ప్రేక్షకులకు చెప్పొచ్చు. అలాగే మార్కెట్ పరంగానూ ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడుతుంది. ఇవన్నీ ఆలోచించిన చెర్రీ.. మహేష్‌‌వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. ఇక కొరటాలకు మహేష్‌తో మంచి సాన్నిహిత్యం ఉండటంతో.. ఇందులో నటించేందుకు సూపర్‌స్టార్‌ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఏదేమైనా చిరు సినిమాలో మహేష్ నటించడంపై అధికారిక ప్రకటన వస్తే.. టాలీవుడ్‌లో ఇదో క్రేజీ మల్టీస్టారర్‌గా నిలవడం ఖాయం.

Read This Story Also: చిరు మూవీలో మహేష్.. చెర్రీ తప్పుకోవడం వెనుక కారణామిదేనా..!