AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: రజనీ స్టోరీ ఆ హీరో ముందే విన్నారా..!

ఈ ఏడాది దర్బార్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'అన్నత్తే' అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలైంది

Rajinikanth: రజనీ స్టోరీ ఆ హీరో ముందే విన్నారా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 27, 2020 | 9:50 PM

Share

ఈ ఏడాది దర్బార్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘అన్నత్తే’ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలైంది. ఇక ఇది రిలీజైనప్పటి నుంచి అజిత్ ఫ్యాన్స్ ఇది మా హీరో కోసం రాసిన కథంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘అన్నత్తే స్టోరీ అజిత్‌కు తెలుసు’’.. ‘‘అజిత్‌ కోసమే అన్నాత్తే స్టోరీ రాశారు’’.. ‘‘అన్నత్తే స్టోరీని అజిత్ ముందే విన్నారు’’ అంటూ వారు కామెంట్లు పెడుతున్నారు. కాగా దర్శకుడు శివతో అజిత్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది.

వీరిద్దరి కాంబినేషన్‌లో వరుసగా నాలుగు సినిమాలు వచ్చాయి. ఇటీవల కాలంలో ఇలా దర్శకుడు, హీరో కాంబినేషన్‌ వరుసగా నాలుగు సార్లు కంటిన్యూ అవ్వడమన్నది చాలా అరుదైన విషయం. అంతేనా ఆ నాలుగు చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్లు కావడం మరో విశేషం. ఇలా వీరిద్దరి మధ్య మంచి బంధం ఉండగా.. విశ్వాసంకు ముందే అన్నత్తే కథను అజిత్‌కు చెప్పారట శివ. ఇక ఇప్పుడు ఆ సినిమాను రజనీ చేస్తున్నారట. ఇదే విషయాన్ని అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న అన్నాత్తేలో రజనీ సరసన టబు, మీనా, నయనతార నటిస్తున్నారు. కీర్తి సురేష్, కమెడియన్ సూరి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. డి. ఇమ్మన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతోన్న రజనీ.. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Follow Us
ఆరు ఎకరాల ఆస్తి ఉన్నా అనాథలయ్యారు.. వృద్ధ దంపతుల కన్నీటి గాథ
ఆరు ఎకరాల ఆస్తి ఉన్నా అనాథలయ్యారు.. వృద్ధ దంపతుల కన్నీటి గాథ
30 రోజులు పంచదార తినడం మానేస్తే శరీరంలో ఊహించని మార్పులు
30 రోజులు పంచదార తినడం మానేస్తే శరీరంలో ఊహించని మార్పులు
Career Astrology: ఈ రాశుల వారికి కొత్త ఉద్యోగ ఆఫర్లు పక్కా..!
Career Astrology: ఈ రాశుల వారికి కొత్త ఉద్యోగ ఆఫర్లు పక్కా..!
పెళ్లయిన ఏడాదికే గల్ఫ్‌ దేశానికి వలస.. 44 ఏళ్ల తర్వాత శవమై
పెళ్లయిన ఏడాదికే గల్ఫ్‌ దేశానికి వలస.. 44 ఏళ్ల తర్వాత శవమై
170 ఎకరాల భూమిని సైనికులకు ఫ్రీగా ఇచ్చిన టాలీవుడ్ హీరో ఎవరంటే?
170 ఎకరాల భూమిని సైనికులకు ఫ్రీగా ఇచ్చిన టాలీవుడ్ హీరో ఎవరంటే?
టీమిండియా బ్యాటర్లకు జోఫ్రా ఆర్చర్ స్ట్రాంగ్ కౌంటర్
టీమిండియా బ్యాటర్లకు జోఫ్రా ఆర్చర్ స్ట్రాంగ్ కౌంటర్
కొడుకు కోసం ఓ తల్లి యాగం.. JEEలో 91.8 పర్సెంటైల్‌తో IIT కల సాకారం
కొడుకు కోసం ఓ తల్లి యాగం.. JEEలో 91.8 పర్సెంటైల్‌తో IIT కల సాకారం
ఏళ్ళ తరబడి కీళ్ల వాతం నొప్పులతో బాధపడేవారికి ఈ పొడి గొప్ప ఔషధం..
ఏళ్ళ తరబడి కీళ్ల వాతం నొప్పులతో బాధపడేవారికి ఈ పొడి గొప్ప ఔషధం..
ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలకు ఇబ్బందా..? గడ్కరీ క్లారిటీ
ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలకు ఇబ్బందా..? గడ్కరీ క్లారిటీ
విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. డైట్‌ ఛార్జీలు 10శాతం పెంపు
విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. డైట్‌ ఛార్జీలు 10శాతం పెంపు