AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్.. ఇదెవ్వరూ ఊహించలేదుగా

కన్నడ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ సినిమా టాక్సిక్. ఆగస్టు 26న విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా మొదటి రోజు ఈ పాన్ ఇండియా సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత వసూళ్లు భారీగా పడిపోయాయి.

Toxic Movie: యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్.. ఇదెవ్వరూ ఊహించలేదుగా
Toxic Movie, Mahesh Babu
Basha Shek
|

Updated on: Sep 01, 2026 | 9:49 PM

Share

కేజీఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటించిన సినిమా ‘టాక్సిక్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. సినిమాలో యాక్షన్ సీన్లు, బోల్డ్ సన్నివేశాలు తప్పితే ఆకట్టుకునే కంటెంట్ లేదని రివ్యూయర్లు తేల్చేశారు. దీంతో మొదటి రోజు భారీ కలెక్షన్లు సాధించిన టాక్సిక్ మూవీ రెండో రోజు నుంచి ఎదురీదడం ప్రారంభించింది. ఈ సంగతి పక్కన పెడితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని టాక్సిక్ సినిమాకు రేటింగ్ ఇచ్చాడన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. లెటర్‌ బాక్స్ డీ అనే ఖాతాలో పలు సినిమాలకు రేటింగ్ ఇచ్చాడు గౌతమ్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషా సినిమాలకు కూడా గౌతమ్ రేటింగ్ ఇచ్చాడు. అందులో తన తండ్రి మహేష్ బాబు నటించిన సినిమాలు కూడా ఉండడం గమనార్హం. మహేష్ బాబు నటించిన ‘పోకిరి’, ‘1: నేనొక్కడినే’ సినిమాలకు గౌతమ్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. అదే సమయంలో ‘నిజం’, ‘వంశీ’ చిత్రాలకు 2 స్టార్ రేటింగ్ ఇవ్వగా.. ‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి కేవలం ఒక్క స్టార్ మాత్రమే ఇచ్చాడు. అలాగే లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రవితేజ ఇరుముడి సినిమాకు 3 రేటింగ్ ఇచ్చాడీ స్టార్ కిడ్. ఇదే క్రమంలో యశ్ నటించిన టాక్సిక్ మూవీకి ఏకంగా 0.5 రేటింగ్ ఇచ్చాడు గౌతమ్. ఇప్పుడిదే విషయం టాలీవుడ్, శాండల్ వుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

కాగా ఈ లెటర్‌ బాక్స్ డీ ప్రొఫైల్‌లో దాదాపు 400కు పైగా సినిమాలకు రేటింగ్స్ ఇచ్చాడు గౌతమ్. హాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్స్ ‘ది ఒడిస్సీ’, ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సినిమాలకు 4.5 స్టార్ ఇచ్చాడు గౌతమ్. ఇక ‘షోలే’, ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’, ‘నైవ్స్ అవుట్’, ‘జెర్సీ’ చిత్రాలకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వగా బాలీవుడ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ ధురందర్-1కి 4 స్టార్, ధురందర్- 2కి 3 స్టార్ ఇచ్చాడు. ఇక లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి 4 స్టార్ రేటింగ్ ఇవ్వగా, ‘టాక్సిక్’ లాగే ‘లైగర్’కు కూడా 0.5 స్టార్ ఇచ్చాడు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీకి 2.5 స్టార్ రేటింగ్స్ ఇచ్చాడు. అలాగే బాహుబలి 2 కు 5, పెళ్లి చూపులు, సీతారామం సినిమాలకు 4.5, ఈగ మూవీకి 4 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం గౌతమ్ రేటింగ్ విషయం నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి
Mahesh Babu Son Rating

Mahesh Babu Son Rating

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం