AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్తగా అకౌంట్ తెరవాలంటే రూ.200 కట్టాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి..

కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో కీలక మార్పులు చేసింది. ఇక నుంచి అకౌంట్ తెరిచేందుకు ఛార్జీలు వసూలు చేయనున్నారు. కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసేందుకు వీటిని వసూలు చేస్తారు. అయితే ఒకేసారి వీటిని తీసుకోరు. విడతల వారీగా వీటిని కట్ చేసుకుంటారు.

కొత్తగా అకౌంట్ తెరవాలంటే రూ.200 కట్టాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి..
Nps
Venkatrao Lella
|

Updated on: Sep 01, 2026 | 9:40 PM

Share

నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలను తీసుకురానుంది. అంతేకాకుండా ఈ పథకంలో చేరేవారి నుంచి ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఒక్కో పీఆర్‌ఏన్‌పై రూ.200 వన్ టైమ్ ఛార్జీ వసూలు చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈకొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రూ.200 రుసుంను ఒకేసారి వసూలు చేయరు. ప్రతీ త్రైమాసికానికి రూ.50 చొప్పున వసూలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. యూనిట్లను రద్దు చేసి వీటిని వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

అలాగే ఎన్‌పీఎస్ పథకాలను ఈక్విటీ పెట్టుబడుల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇక నుంచి 80 శాతం నుంచి 100 శాతం ఈక్విటీ ఉన్న పథకాలను కేటగిరీలో ఏ-గా వర్గీకరించనుండగా.. వీటిని హైరిస్క్ పరిగణిస్తారు. ఇక 60 నుంచి 80 శాతం ఈక్విటీ పెట్టుబడులు ఉంటే కేటగిరీ-బిగా పిలుస్తారు. వీటిని హైరిస్క్ ఉన్న హైగ్రోత్ పథకాలుగా పిలుస్తారు. ఇక 35 నుంచి 60 శాతం ఈక్విటీ పెట్టుబడులు ఉన్నవాటిని కేటగిరీ సీగా పరిగణించనుండగా.. వీటిని బ్యాలెన్స్‌డ్ రిస్క్‌గా చెబుతారు. అలాగే 10 నుంచి 35 శాతం ఈక్విటీ పెట్టుబడులు ఉంటే కేటగిరీ డీలో ఉంటాయి. వీటిని తక్కువ రిస్క్ ఉన్నవాటిగా పరిగణిస్తారు. ఇక 0 నుంచి 10 శాతం వరకు ఈక్విటీ పెట్టుబడులు ఉన్నవాటిని కేటగిరీ ఈలో చేరుస్తారు. వీటిని రుణ ఆధారిత పథకాలుగా గుర్తిస్తారు.

అయితే ఒక పథం రెండు కేటగిరీల్లో ఉండేలా ఎంచుకోవడానికి వీలుండదు. ఏదో ఒక కేటగిరీలో మాత్రమే ఉండేలా కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇక నుంచి పెట్టుబడిదారులు రిస్క్ చేసే స్వభావాన్ని బట్టి ఏ పథకంలో ఉండాలనేది నిర్ణయించుకోవచ్చు. తమ రిస్క్ స్థాయికి తగ్గట్లు పథకాన్ని ఎంచుకోవచ్చు. పెన్షన్ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర్‌డీఏ ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వీటికి సంబంధించి ఆగస్ట్ 28వ తేదీన సర్క్యూలర్ జారీ చేసింది. వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని సర్క్యూలర్‌లో స్పష్టంగా పేర్కొంది. ఈ కొత్త వర్గీకరణ వల్ల రిస్క్, రాబడి, ఛార్జీలు స్పష్టంగా కనిపించనున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పథకంగా చెప్పవచ్చు. ఇది ఒక స్వచ్ఛంద, దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు పథకంగా పిలుస్తారు. ఇందులో స్వచ్చంధంగా ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. 18 నుంచి 85 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఇందులో చేరవచ్చు.

Follow Us
మత్తు ఇంజెక్షన్ల కేసులో మరో ట్విస్ట్.. వేలాది మందికి డ్రగ్స్..
మత్తు ఇంజెక్షన్ల కేసులో మరో ట్విస్ట్.. వేలాది మందికి డ్రగ్స్..
బిగ్ బాస్ తెలుగు 10.. స్టేజీపైనే జబర్దస్త్ కమెడియన్‌కు బిగ్‌ షాక్
బిగ్ బాస్ తెలుగు 10.. స్టేజీపైనే జబర్దస్త్ కమెడియన్‌కు బిగ్‌ షాక్
విమానంలో ప్రయాణికుడి హంగామా.. సీటుకు టేప్‌తో చుట్టేసారు!
విమానంలో ప్రయాణికుడి హంగామా.. సీటుకు టేప్‌తో చుట్టేసారు!
బ్యాంక్ అకౌంట్ లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా?
బ్యాంక్ అకౌంట్ లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా?
పిచ్చెక్కించే సూపర్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఈవీ
పిచ్చెక్కించే సూపర్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఈవీ
ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా..? సంపద నిలవకపోవడానికి ఇవే కారణమని..
ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా..? సంపద నిలవకపోవడానికి ఇవే కారణమని..
మెటాలిక్​ గ్రే స్ట్రాప్‌తో బోట్‌ స్మార్ట్‌వాచ్‌.. స్పెషాలిటీ ఇదే
మెటాలిక్​ గ్రే స్ట్రాప్‌తో బోట్‌ స్మార్ట్‌వాచ్‌.. స్పెషాలిటీ ఇదే
యాపిల్ మాజీ సీఈవో నికర ఆస్తి విలువ ఎంత? ఇక ఆయన కొత్త రోల్ ఏంటి?
యాపిల్ మాజీ సీఈవో నికర ఆస్తి విలువ ఎంత? ఇక ఆయన కొత్త రోల్ ఏంటి?
ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ
ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ
స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లే సూపర్ అంటే.. ధర ఇంత తక్కువా
స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లే సూపర్ అంటే.. ధర ఇంత తక్కువా