AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: అబ్బా సాయిరాం.. ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

పసిడి ప్రియులకు ఇదో గుడ్‌న్యూస్.. ఎందుకంటే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. కేవలం ఒకే రోజులో 24 క్యారట్ల బంగారం ధర రూ.2వేలకుపైగా తగ్గగా, కేజీ వెండి ధర ఏకంగా రూ.10వేల వరకు దిగొచ్చింది. కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Price: అబ్బా సాయిరాం.. ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
Gold Rate Today
Anand T
|

Updated on: Sep 01, 2026 | 9:18 PM

Share

బంగారం కొనే వారికి ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతున్న బంగారం ధరలకు సడెన్ బ్రేక్ పడింది. రెండ్రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. ఒకనానొక సమయంలో రికార్డు స్థాయి. రూ.1.60లక్షలకు చేరిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. మంగళవారం ఒక్కరోజే తులం బంగారంపై రూ.2వేలకుపైగా దిగొచ్చాయి. ఈ భారీ హెచ్చు తగ్గుల తర్వాత దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,54,090 వద్ద ట్రేడవుతుండగా ఉదయం ఈ ధర రూ.1,54,090గా ఉంది.

అటు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. మంగళవారం ఒక్కరోజే అటు వెండి ధర కూడా భారీగా రూ.10వేల వరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,50,000 వద్ద ట్రేడవుతుండగా ఉదయం 10 గంటలకు ఈ ధర రూ.2,59,900 గా ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశంలోని ప్రధాన నగారల్లో బంగారం, ధరలు

  • హైదరాబాద్‌ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,090 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,250 వద్ద కొనసాగుతోంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,240 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,400 వద్ద కొనసాగుతోంది.
  • ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,090 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,250వద్ద కొనసాగుతోంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,640 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,750 వద్ద కొనసాగుతోంది.
  • కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,090 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,250వద్ద కొనసాగుతోంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,090 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,250వద్ద కొనసాగుతోంది.

గత వారం రోజులు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఇందుకు ప్రధాన కారణం అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్లను మరింత కాలం పెంచవచ్చనే సంకేతాలు వెలువడటమేనని విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి ఈ అంతర్జాతీయ ప్రభావాల కారణంగా బంగారం ధరల్లో ఎప్పుడైనా మార్పులు రావచ్చు. అందుకే మీరు కొనే ముందు ఒకసారి మీ సమీపంలోని షాప్‌లకు వెళ్లి ధరలు తెలుసుకోవడం మంచింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
అది టానింగ్‌నా.. పిగ్మెంటేషన్‌నా? చర్మంపై ఈ మచ్చలు వస్తే జాగ్రత్త
అది టానింగ్‌నా.. పిగ్మెంటేషన్‌నా? చర్మంపై ఈ మచ్చలు వస్తే జాగ్రత్త