AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: కామెడీ కింగ్స్ ఈజ్ బ్యాక్.. జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. ఆనందంతో రష్మీ కన్నీళ్లు

జబర్దస్త్ షోలోకి ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు రీఎంట్రీ ఇచ్చారు. జడ్జీగా కామెడీ షోను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఆయనతో పాటు ధనాధన్ ధన్ రాజ్, హైపర్ ఆది, చలాకీ చంటి, సద్దాం, వినోద్ అలియాస్ వినోదిని.. ఇలా చాలా మంది కమెడియన్లు ఈ షోలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

Jabardasth: కామెడీ కింగ్స్ ఈజ్ బ్యాక్.. జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. ఆనందంతో రష్మీ కన్నీళ్లు
Jabardasth
Basha Shek
|

Updated on: Sep 01, 2026 | 8:18 PM

Share

బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ కామెడీ షో జబర్దస్త్ కు పునఃవైభవం తీసుకురావాలని గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గతంలో ఈ కామెడీ షోకు వెన్నెముకగా నిలిచిన స్టార్ కమెడియన్లను తిరిగి జబర్దస్త్ లోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ కు జడ్జీగా తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఆయన వచ్చిన తర్వాతే జబర్దస్త్ కు కొత్త కళ వచ్చిందని చెప్పవచ్చు. కమెడియన్ల మధ్య పోటీ పెంచేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు నాగబాబు. తద్వారా జబర్దస్త్ షోకు మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చేలా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు గతంలో జబర్దస్త్ లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉంటోన్న స్టార్ కమెడియన్లను తిరిగి ఈ షోలోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే హైపర్ ఆది, ధనాధన్ ధన్‌రాజ్, చలాకీ కంటి, సద్దాం, వినోద్ అలియాస్ వినోదిని తదితరులు జబర్దస్త్ లోకి రీ ఎంట్రీచ్చారు. తమదైన కామెడీ పంచులతో ఆడియెన్స్ ను మంచి వినోదం అందిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో ఇద్దరు స్టార్ కమెడియన్లు చేరారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటోన్న సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులు కూడా జబర్దస్త్‌ షోలోకి అడుగుపెట్టారు. ఈ మేరకు ‘కామెడీ కింగ్స్ ఈజ్ బ్యాక్’ అంటూ జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక ఎప్పటిలాగే తన కామెడీ పంచులు, ప్రాసలతో ఆడియెన్స్ ను కడుపుబ్వా నవ్వించారు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను. అలాగే యాంకర్ రష్మీతో కలిసి ఇద్దరూ కామెడీ చశారు. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత సుధీర్ ను చూడాగానే యాంకర్ రష్మీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఇదే క్రమంలో కాస్త ఎమోషనలైంది రష్మీ. తాను, సుడిగాలి సుధీర్ ఒకేసారి జబర్దస్త్ మొదలుపెట్టామని, తను వెళ్లిపోయాడని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుందీ స్టార్ యాంకర్. మొత్తానికి జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ చాలా సరదాగా, ఎమోషనల్ గా సాగిందని చెప్పవచ్చు. అయితే సుధీర్, గెటప్ శ్రీను కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కే గెస్టులుగా వచ్చారని తెలుస్తోంది. మరి ఈ స్టార్ కమెడియన్స్ జబర్దస్త్ లో కొనసాగుతురా? లేదా? అన్నది ఫుల్ క్లారిటీ రావాలంటే ఆదివారం (సెప్టెంబర్ 6) సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్