AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సరిలేరు’కు సెన్సార్ పూర్తి.. విడుదల అప్పుడేనా..!

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ తాజాగా సెన్సార్‌ను పూర్తి చేసింది. సినిమా మొత్తాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. దీంతో ప్రమోషన్లో మరింత వేగాన్ని పెంచనుంది సరిలేరు టీమ్. ఇదిలా ఉంటే సెన్సార్ పూర్తి అయ్యిందంటూ విడుదల చేసిన పోస్టర్లలో రిలీజ్ డేట్ లేకపోవడం గమనర్హం. దీంతో ఈ సినిమా ఎప్పుడు […]

'సరిలేరు'కు సెన్సార్ పూర్తి.. విడుదల అప్పుడేనా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 02, 2020 | 7:28 PM

Share

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ తాజాగా సెన్సార్‌ను పూర్తి చేసింది. సినిమా మొత్తాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. దీంతో ప్రమోషన్లో మరింత వేగాన్ని పెంచనుంది సరిలేరు టీమ్. ఇదిలా ఉంటే సెన్సార్ పూర్తి అయ్యిందంటూ విడుదల చేసిన పోస్టర్లలో రిలీజ్ డేట్ లేకపోవడం గమనర్హం. దీంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందన్న అనుమానం ఫ్యాన్స్‌లో మొదలైంది.

అయితే ఈ సినిమాను ప్రారంభించిన సమయంలో 2020 సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించిన టీమ్.. ఆ తరువాత జనవరి 12న ఫైనల్ చేసుకుంది. అయితే అదే రోజు అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీని విడుదల చేయాలనుకున్నారు. దీంతో ఈ ఇరు టీమ్‌ల మధ్య వివాదం మొదలైంది. అయితే ఈ విషయంలో ఇరు మూవీల నిర్మాతలు రాజీకి రావడంతో.. ఒకరోజు గ్యాప్‌తో(సరిలేరు నీకెవ్వరు జనవరి 11న, అల వైకుంఠపురములో 12) ఈ మూవీలను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ పాటలు, టీజర్‌తో ‘అల వైకుంఠపురములో’పై అందరిలో అంచనాలు పెరిగాయి. ఇక ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని భావించిన ‘అల’ టీమ్.. రెండు రోజుల ముందుగానే (జనవరి 10) రావాలని అనుకుంటున్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. దీంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. విడుదల తేది విషయంలో ‘అల’తో ఏ మాత్రం తగ్గనంటోన్న ‘సరిలేరు’ టీమ్.. అదే రోజునే తాము కూడా వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్లీ ఈ రెండు టీమ్‌ల మధ్య సంప్రదింపులు జరుగున్నట్లు ఫిలింనగర్ టాక్. అందుకే తాజా పోస్టర్‌లో ‘సరిలేరు’ టీమ్ విడుదల తేదిని ప్రకటించలేదని తెలుస్తోంది.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటించాడు. ఆయన సరసన రష్మిక నటించగా.. విజయశాంతి, సంగీత, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిల్ సుంకర, మహేష్ బాబు, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.