AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోలీవుడ్ హీరోతో ప్రేమాయణంపై గుత్తా జ్వాల ఏమందంటే..!

బ్యాడ్మింటర్ మాజీ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ప్రేమలో పడింది. కోలీవుడ్‌కు చెందిన యంగ్ హీరోతో ఆమె డీప్ లవ్‌లో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ.. అతడితో సన్నిహితంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, తమ రిలేషన్ గురించి చెప్పకనే చెప్పింది ఈ క్రీడాకారిణి. అంతేకాదు తాజాగా తన పేరిట గుత్తా జ్వాల అకాడమీని స్థాపించగా.. దాన్ని ఆ హీరో తన సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం మరో విశేషం. ఇంతకు గుత్తా జ్వాల […]

కోలీవుడ్ హీరోతో ప్రేమాయణంపై గుత్తా జ్వాల ఏమందంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 02, 2020 | 8:45 PM

Share

బ్యాడ్మింటర్ మాజీ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ప్రేమలో పడింది. కోలీవుడ్‌కు చెందిన యంగ్ హీరోతో ఆమె డీప్ లవ్‌లో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ.. అతడితో సన్నిహితంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, తమ రిలేషన్ గురించి చెప్పకనే చెప్పింది ఈ క్రీడాకారిణి. అంతేకాదు తాజాగా తన పేరిట గుత్తా జ్వాల అకాడమీని స్థాపించగా.. దాన్ని ఆ హీరో తన సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం మరో విశేషం. ఇంతకు గుత్తా జ్వాల ఇష్టపడుతున్న ఆ హీరో ఎవరంటే..! విష్ణు విశాల్.

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు విశాల్.. హీరోగా మంచి పేరును సాధించుకున్నాడు. ఇక రాట్చసన్ తరువాత అతడికి ఆఫర్లు మరిన్ని పెరిగాయి. ఈ హీరో ఇప్పుడు గుత్తా జ్వాలతో ప్రేమలో ఉన్నాడు. అయితే విష్ణు విశాల్‌కు ఇదివరకే పెళ్లైంది. నటుడు కె.నటరాజ్ కుమార్తె రజనీని 2011లో విష్ణు వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఒక బాబు కూడా ఉండగా.. కొన్ని కారణాల వలన ఈ ఇద్దరు 2018లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు తన సహచర ఆటగాడు చేతన్ ఆనంద్‌ను వివాహం చేసుకున్న ఆమె.. 2011లో అతడి నుంచి విడిపోయింది. ఇక గతేడాది ఈ ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలవగా.. ఆ తరువాత ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఇక వాటికి బలం చేకూరుస్తూ తాజాగా ఫొటోలను షేర్ చేసింది గుత్తా.

ఇక తాజాగా గురువారం అకాడమీ ప్రారంభం నేపథ్యంలో ఆ ఫొటోలపై ఆమెను ప్రశ్నించగా.. ఫొటో గురించి తరువాత మాట్లాడుకుందాం. ముందుగా అకాడమీ గురించి చర్చిద్దాం అంటూ దాటేసింది. అయితే జ్వాల అకాడమీ గురించి ఇదివరకే విష్ణు విశాల్ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. ‘‘జ్వాల గుత్తా అకాడమీ నుంచి ఓ శుభవార్త. ప్రొఫెషనల్ ఆటగాళ్లు, బ్యాడ్మింటన్ ఆడాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ఇందులో 14కోర్టులు ఉన్నాయి. అకాడమీ నిర్మాణంను మొదటి నుంచి చూస్తున్నా. చాలా బావుంది. ప్రపంచంలోని బెస్ట్ కోచ్‌లతో ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ అకాడమీకి రిజిస్ట్రేషన్లు ఓపెన్ అయ్యాయి. అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అందరూ ఛాంపియన్లగా బయటికి రావాలి. ఆల్‌ ది బెస్ట్ జ్వాల’’ అంటూ వెల్లడించడం విశేషం.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?