Mahathalli: 30వ పడిలోకి అడుగుపెట్టిన మహాతల్లి.. వైరల్‌ అవుతోన్న బర్త్‌డే సెలబ్రేషన్‌ ఫొటోలు..

|

Sep 10, 2022 | 7:00 AM

Mahathalli: 'హల్లో.. బిజీ పీపుల్‌' అంటూ యూట్యూబ్‌లో సందడి చేసే జాహ్నవి దాసెట్టి చాలా మందికి పరిచయం ఉండే ఉంటుంది. జాహ్నవి అనే పేరు కంటే 'మహాతల్లి' అంటే ఇట్టే గుర్తుపడుతుంటారు. సోషల్‌ మీడియా గురించి...

Mahathalli: 30వ పడిలోకి అడుగుపెట్టిన మహాతల్లి.. వైరల్‌ అవుతోన్న బర్త్‌డే సెలబ్రేషన్‌ ఫొటోలు..
Mahathalli
Follow us on

Mahathalli: ‘హల్లో.. బిజీ పీపుల్‌’ అంటూ యూట్యూబ్‌లో సందడి చేసే జాహ్నవి దాసెట్టి చాలా మందికి పరిచయం ఉండే ఉంటుంది. జాహ్నవి అనే పేరు కంటే ‘మహాతల్లి’ అంటే ఇట్టే గుర్తుపడుతుంటారు. సోషల్‌ మీడియా గురించి కనీస అవగాహన ఉన్న ఎవ్వరికైనా మహా తల్లి పరిచయం ఉండే ఉంటుంది. మరీ ముఖ్యంగా యంగ్ అమ్మాయిలు మహాతల్లిని బాగా ఫాలో అవుతుంటారు. అన్ని రకాల విషయాలను తన వీడియోల్లో ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారు జాహ్నవి. మహాతల్లి యూట్యూబ్‌ ఛానల్‌కు దాదాపు 20 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారంటే జాహ్నవి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సోషల్‌ మీడియాలోనూ మహాతల్లికి ఫాలోయింగ్ ఎక్కువేనని చెప్పాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో జాహ్నవిని 90 వేలకి పైగా ఫాలోఅవుతున్నారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్‌ 7న జాహ్నవి దాసెట్టి పుట్టిన రోజు. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి సంతోషంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. అభిమానులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ ధన్యవాదాలు తెలపుతూ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది జాహ్నవి. ఇందులో తాను 30వ పడిలోకి అడుగుపెట్టినట్లు తెలిపే 30 సింబల్‌తో కూడిన ఫొటోను కూడా పోస్ట్‌ చేశారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ జాహ్నవి ధన్యవాదాలు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..