Cinema : 25 ఏళ్లుగా ట్రెండింగ్.. మళ్లీ థియేటర్లలోకి వస్తున్న సూపర్ హిట్.. యూత్ ఫేవరేట్ ఈ మూవీ..
ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ తెగ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి చిత్రాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ముఖ్యంగా ఈ వాలెంటైన్ వారంలో ప్రేమకథల చిత్రాలను మరోసారి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే 25 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్ అయిన ఓ సినిమాను సైతం రిలీజ్ చేయనున్నారట.

సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు రీరిలీజ్ ట్రెండ్ తెగ నడుస్తున్న సంగతి తెలిసిందే. మనసంత నువ్వే సినిమాను వాలెంటైన్ వీక్ సందర్భంగా మరోసారి విడుదల చేస్తున్నారు మేకర్స్. అలాగే మరికొన్ని ప్రేమకథలు సైతం విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే 25 ఏళ్ల క్రితం సూపర్ హిట్ అయిన సినిమాను మళ్లీ విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. అదే మిన్నలే. పాతికేళ్ల క్రితం థియేటర్లలో సంచలన విజయం సాధించిన సినిమా ఇది. ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. అలాగే సీటీవీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ బ్యానర్ పై డాక్టర్ మురళీ మనోహర్ నిర్మించారు. ఇందులో మాధవన్, రీమా సేన్ జంటగా నటించారు. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
ఈ చిత్రంలోని మనోహరా సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ ను ఊపేస్తుంది. మాధవన్ – గౌతమ్ వాసుదేవ్ మీనన్ – హారిస్ జయరాజ్ కాంబినేషన్‌లో నిర్మించిన ‘మిన్నలే’ చిత్రం ఫిబ్రవరి 13న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత రాహుల్ విడుదల చేస్తున్నారు.ఫిబ్రవరి 2001లో విడుదలై అభిమానుల నుండి అఖండ మద్దతు పొందిన సినిమా ఇది. ఇందులోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..
ఇప్పుడు దాదాపు 25 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ప్రేమకథను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఇక ఈసినిమాలోని మనహోరా సాంగ్ అమ్మాయిలకు ఫేవరేట్. ఇప్పటికీ ఈ పాట అటు సోషల్ మీడియాను, ఇటు యూట్యూబ్ ను ఊపేస్తుంది.
ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.
ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..
