బాలీవుడ్ సింగర్ కనికాకు మరో షాక్..!
కరోనాను జయించి ఇంటికొచ్చిన బాలీవుడ్ సింగర్ కనికాకు మరో షాక్ తగిలింది. ఆమె ఇంటికి సోమవారం లక్నో పోలీసులు వెళ్లారు.

కరోనాను జయించి ఇంటికొచ్చిన బాలీవుడ్ సింగర్ కనికాకు మరో షాక్ తగిలింది. ఆమె ఇంటికి సోమవారం లక్నో పోలీసులు వెళ్లారు. ఈ గాయనిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి ఆమె తరఫున స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ ఈ సందర్భంగా పోలీసుల నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు ఈ నెల 30వరకు ఆమెకు గడువును ఇస్తున్నట్లు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా విదేశాల నుంచి వచ్చిన తరువాత కనికాకు తీవ్ర జ్వరం ఉండగా.. ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టి కావాలనే నిర్లక్ష్యం చేసిందంటూ లక్నో పోలీసులు గత నెలలో ఆమెపై ఎఫ్‌ఆర్ఐ నమోదు చేశారు. భారత శిక్షా స్మృతిలోని 188, 269, 270 సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ విషయంలో ఆమెకు పోలీసులు తాజాగా నోటీసులు అందజేశారు. ఈ విషయంపై ఇన్‌స్పెక్టర్ జేపీ సింగ్ మాట్లాడుతూ.. నోటీసులను కనికాకు స్వయంగా అందించాం. సరోజినీనగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. ఆమె తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయాల్సి ఉంది అని అన్నారు. తన తరఫున లాయర్‌ను కలిసిన తరువాత స్టేట్‌మెంట్ ఇస్తానని ఈ సందర్భంగా కనికా తమకు చెప్పినట్లు ఆయన వివరించారు. కాగా కనికా స్టేట్‌మెంట్ ఇచ్చిన తరువాత ఆమెపై తదుపరి చర్యలు తీసుకుంటామని కృష్ణా నగర్ ఏసీపీ దీపక్ కుమార్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 6న కనికా ఇంటికి వచ్చింది. తాజాగా మాట్లాడుతూ.. తన గురించి, తన ట్రావెల్ టైం గురించి, తన కరోనా వ్యాధి గురించి అన్నీ తప్పుడు సమాచారమే బయటికొచ్చిందని తెలిపిన విషయం తెలిసిందే. మరోవైపు కరోనా బాధితుల కోసం ప్లాస్మా దానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని కనికా ప్రకటించింది. ఈ మేరకు లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీని సంప్రదించారు.
Read This Story Also: షాకింగ్.. ఆ దేశంలో 874 మంది సైనికులకు కరోనా.. ఒకరు వెంటిలేటర్‌పై..!