Kalki: కల్కి సీక్వెల్‌ టైటిల్‌ ఇదేనా.? ఇంట్రెస్టింగ్ గాసిప్‌..

కాగా ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నిజానికి చెప్పాలంటే సినిమా అసలు కథ అంతా పార్ట్2లోనే ఉంది. దీపికాకు పుట్టబోయేది కల్కినేనా.? యాస్కిన్‌ అంతం ఎలా అవుతాడు.? ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ పార్ట్‌2లో ఉండనున్నాయి...

Kalki: కల్కి సీక్వెల్‌ టైటిల్‌ ఇదేనా.? ఇంట్రెస్టింగ్ గాసిప్‌..
Kalki 2
Follow us

|

Updated on: Sep 23, 2024 | 7:26 AM

ప్రభాస్‌ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పురాణాలను, భవిష్యత్తు ప్రపంచాన్ని మిక్స్‌ చేసి నాగ అశ్విన్‌ సృష్టించిన కొత్త ప్రపంచం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అందుకు అనుగుణంగానే మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటేసింది.

కాగా ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నిజానికి చెప్పాలంటే సినిమా అసలు కథ అంతా పార్ట్2లోనే ఉంది. దీపికాకు పుట్టబోయేది కల్కినేనా.? యాస్కిన్‌ అంతం ఎలా అవుతాడు.? ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ పార్ట్‌2లో ఉండనున్నాయి. ఇదిలా ఉంటే కల్కి పార్ట్‌2కి సంబంధించి ఇప్పటికే కొంతమేర షూటింగ్ కూడా పూర్తయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రాజాసాబ్‌, సలార్‌2 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ ఇవి పూర్తి కాగానే కల్కి2ని మొదలు పెట్టనున్నాడు.

ఇదిలా ఉంటే కల్కి 2 చిత్రానికి సంబంధించి ఇప్పటికే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ సినిమా టైటిల్‌ ఇదేనంటూ కొన్ని పుకార్లు షికార్లు చేస్ఉతన్నాయి. వీటి ప్రకారం కల్కి సీక్వెల్‌కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు సీక్వెల్ మొత్తం ప్రభాస్‌ చుట్టూ తిరుగుతందని. ఇక పార్ట్‌2లో పురాణాల లెంగ్త్‌ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.

కర్ణుడు, అశ్వద్ధామల మధ్య ఎక్కువ సన్నివేశాలు ఉండనున్నాయని సమాచారం. ఇక మహాభారత ఘట్టానికి కూడా పార్ట్‌2లో ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రటకన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..