AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

45 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న ఆ స్టార్ డైరెక్టర్.. ఫోటోస్ వైరల్‌

Krish Jagarlamudi Wedding: సోషల్ మీడియాలో డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు ఎట్టకేలకు నిజమైయ్యాయి. గైనకాలజిస్టు డా.ప్రీతిని క్రిష్ రెండు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

45 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న ఆ స్టార్ డైరెక్టర్.. ఫోటోస్ వైరల్‌
Krish Jagarlamudi Second Marriage
Velpula Bharath Rao
|

Updated on: Nov 11, 2024 | 7:43 PM

Share

ప్రస్తుతం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఘాటీ’ చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఇది ఇలా ఉంటే క్రిష్ తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు. గైనకాలజిస్ట్ ప్రీతి చల్లాను వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో ఆమెకు మూడుముళ్లు వేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సినీవర్గాలు సోషల్ మీడియాలో షేర్ చేసి వీరిద్దరికి విషెస్ చెప్పాయి. ఈ నెల 16న రిసెప్షన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. క్రిష్ 2016లో మొదటి వివాహం చేసుకొని 2018లో విడాకులు తీసుకున్నాడు.

క్రిష్, ప్రీతిలకు ఇది రెండవ వివాహమే అని చెప్పాలి. క్రిష్ గతంలో డాక్టర్ రమ్యను వివాహం చేసుకున్నాడు. 2018 లో విడాకులు తీసుకున్నాడు. ప్రీతి చల్లా క్రిష్ స్వస్థలమైన గుంటూరులోని ప్రసిద్ధ చల్లా కుటుంబానికి చెందినది.  వారు చాలా కాలంగా కుటుంబ స్నేహితులుగా ఉన్నారని, నెమ్మదిగా, వీరిద్దరి సంబంధం స్నేహితులు నుండి వివాహం వరకు దారి తీసిందని తెలుస్తుంది. డాక్టర్ ప్రీతి చల్లా 2007 నుండి మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె చెన్నైలోని శ్రీ రామచంద్ర విశ్వవిద్యాలయంలో MBBS చేసింది. అక్కడ ఆమె డిస్టింక్షన్‌తో పట్టభద్రురాలైంది. అదే సంస్థ నుండి ప్రసూతి మరియు గైనకాలజీలో MS పూర్తి చేసింది. ఆమె కుటుంబంలో నాల్గొవ తరం వైద్యురాలిగా, కుటుంబ వారసత్వం అయిన చల్లా ఆసుపత్రిని లీడ్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.