Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్.. లేడీ వకీల్ సాబ్ అంతే!

హీరోలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా రెండు, మూడు ప్లాఫులు పడితే చాలు ఫేడవుట్ అయిపోతుంటారు. ఇక మరికొందరు పెళ్లి, పిల్లల కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరమై పోతుంటారు. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా ఈ కోవకే చెందుతుంది.

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్.. లేడీ వకీల్ సాబ్ అంతే!
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Dec 25, 2024 | 6:48 PM

పై ఫొటోలో ఉన్నది ఓ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. పైగా మన తెలుగమ్మాయి. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ అందాల తార ఆ తర్వాత వెండితెరకు పరిచయమైంది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తన అందం, అభినయంతో మంచి మార్కులే కొట్టేసింది. కెరీర్ ప్రారంభంలో వరుసగా విజయాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత వరుసగా పరాజయాలు పలకరించాయి. దీంతో సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ఎంచెక్కా రాజకీయాల్లో చేరింది. అదే క్రమంలో లాయర్ కోర్సు కూడా పూర్తి చేసింది. ఇప్పుడు ఎంచెక్కా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో లాయర్ గా విధులు నిర్వహిస్తోంది. ఇంతకు ఈ లేడీ వకీల్ సాబ్ ఎవరో తెలుసా? ఈరోజుల్లో సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రేష్మ రాథోడ్. తెలంగాణలోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చెందిన ఆమె వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో చదువుకుంది. ఇదే క్రమంలో 2012లో వెంకటేశ్-త్రిష జంటగా నటించిన ‘బాడీగార్డ్’ సినిమాలో హీరోయిన్‌కి ఫ్రెండ్‌గా నటించి మెప్పించింది. అదే ఏడాది మారుతి దర్శకత్వంలో ‘ఈ రోజుల్లో’ అనే యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రేష్మ అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

హీరోయిన్ గా తొలి మూవీతోనే సూపర్ సక్సెస్ అందుకున్న రేష్మ ఉదయ్ కిరణ్ తో కలిసి జై శ్రీరామ్‌ అనే సినిమాలో నటించింది. ఇది పెద్దగా ఆడలేదు. అలాగే లవ్ సైకిల్, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం, అప్పవుమ్ వీంజుమ్(మలయాళ), అదగపట్టత్తు మగజననంగలయ్(తమిళ) తదితర చిత్రాలు కూడా ఆడియెన్స్ ను నిరాశపర్చాయి. దీంతో 2017 తర్వాత యాక్టింగ్ కు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసిందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ తో రేష్మ..

సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి చేరిన రేష్మ బీజేపీ పార్టీలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో లాయర్ కోర్సు కూడా పూర్తి చేసింది. హీరోయిన్ గా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయినప్పటికీ లాయర్ గా రేష్మ తనదైన మార్క్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలో సుప్రీంకోర్టు లాయర్‌గా ఆమెకు పదోన్నతి లభించింది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ లేడీ వకీల్ సాబ్. తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది.

  సుప్రీం కోర్టు వద్ద రేష్మ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?