Tollywood: 4వ తరగతి చదువు మానేసింది.. 14 ఏళ్లకే బలవంతపు పెళ్లి.. ఇంటి నుంచి పారిపోయి ఇండస్ట్రీనే శాసించిన హీరోయిన్..

చిన్న వయసులోనే సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. అందమైన రూపం.. మత్తెక్కించే కళ్లతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. కానీ కెరీర్ పీక్స్ లో ఉండగానే అనుహ్యంగా ఆమె జీవితం ముగిసిపోయింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood: 4వ తరగతి చదువు మానేసింది.. 14 ఏళ్లకే బలవంతపు పెళ్లి.. ఇంటి నుంచి పారిపోయి ఇండస్ట్రీనే శాసించిన హీరోయిన్..
Silk Smitha

Updated on: Jun 26, 2025 | 7:04 AM

భారతీయ సినీ పరిశ్రమలో ఆమె ప్రయాణం ప్రత్యేకం. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని.. చిన్న ఉద్యోగం కోసం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఆ తర్వాత ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. 80వ దశకంలో ఇండస్ట్రీని ఏలేసిన స్టార్ హీరోయిన్. అప్పట్లో ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోస్ సైతం వెయిట్ చేసేవారు. దక్షిణాదిని శాసించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె నటించిన సినిమా విడుదలవుతుందంటే.. థియేటర్లకు జనాలు క్యూ కట్టేవారు. ప్రతి దర్శకుడు, నిర్మాత ఆమెతో కలిసి పనిచేయాలని కోరుకునేవారు. అప్పట్లో గ్లామర్ పాత్రలతో యూత్ కు పిచ్చేక్కించేసిన హీరోయిన్ ఆమె. ముఖ్యంగా స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్. ఒకప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకున్న ఆమె.. 1990లోనే ఒక్క సినిమాకు ఏకంగా రూ.1 లక్ష రెమ్యునరేషన్ తీసుకుంది. స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె.. కెరీర్ అత్యున్నత్త స్థాయిలో ఉండగానే జీవితాన్ని ముగించింది.

చిన్నప్పటి నుంచే ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఆర్థిక సమస్యలతో 4వ తరగతిలోనే చదువు మానేసింది. ఆ తర్వాత 14 ఏళ్లకే ఆమెకు బలవంతంగా వివాహం చేశారు. ఇక వైవాహిక జీవితంలో భర్త, అత్తమామల వేధింపులకు గురిచేయడంతో రెండేళ్లకే ఇంటి నుంచి పారిపోయింది. ఆ తర్వాత తన దగ్గరి బంధువు సాయంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ ఇండస్ట్రీలో అత్యున్నత శిఖరాన్ని చేరుకుంది. ఆమె మరెవరో కాదండి.. వడ్లపాటి విజయలక్ష్మి.. అలియాస్ సిల్క్ స్మిత. 1980 నుంచి 1990ల మధ్య దక్షిణాదిని ఏలేసిన హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు.. అనేక స్పెషల్ సాంగ్స్ చేసి మరింత పాపులర్ అయ్యింది.
కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆమె 1996 సెప్టెంబర్ 23న హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతోనే సిల్క్ స్మిత మరణించిందని సమాచారం. కానీ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

Silk Smitha Look

ఇవి కూడా చదవండి : 

ఇవి కూడా చదవండి

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..