AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devi Movie: దేవి సినిమాలో విలన్ గుర్తున్నాడా.. ? ఒకప్పుడు పవర్ ఫుల్ పోలీస్.. ఇప్పుడేం చేస్తున్నారంటే..

డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాల్లో దేవి ఒకటి. 1999 లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా వస్తుందంటే ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇందులో ప్రేమ, వనితా విజయ్ కుమార్, షిజు, భానుచందర్, బాబు మోహన్, సౌందర్య కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా సృష్టంచిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు.

Devi Movie: దేవి సినిమాలో విలన్ గుర్తున్నాడా.. ? ఒకప్పుడు పవర్ ఫుల్ పోలీస్.. ఇప్పుడేం చేస్తున్నారంటే..
Devi Movie
Rajitha Chanti
|

Updated on: Jul 13, 2026 | 10:12 PM

Share

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ దేవి. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో సీనియర్ హీరోయిన్ ప్రేమ నటించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ప్రస్తుత కాలంలో భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా వీఎఫ్‌ఎక్స్ నాణ్యతపై విమర్శలు వస్తున్న సందర్భంలో, దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దశాబ్దాల క్రితమే గ్రాఫిక్స్‌ను ఎంత సమర్థవంతంగా ఉపయోగించారో దర్శకుడు దేవి ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అమ్మోరు, దేవి వంటి చిత్రాల్లోని గ్రాఫిక్స్ ఇప్పుడు చూసినా కూడా ఎవరూ వేలెత్తి చూపించలేరని, ఆనాటి పరిమిత సాంకేతికతతో అంత అద్భుతంగా ఎలా చేశారనే ప్రశ్న వస్తుందని ఆయన అన్నారు. గ్రాఫిక్స్ అనే ఆలోచనను మొదట నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ప్రతిపాదించారని, తెలుగు సినిమాను మరింత విస్తృతం చేయడానికి ఆంగ్ల సినిమాల్లోని టెక్నాలజీని తెలుగు కథలకు అడాప్ట్ చేయాలని ఆయన కోరుకున్నారని దేవి ప్రసాద్ వెల్లడించారు. ఈ ఆలోచనను కోడి రామకృష్ణ అమ్మోరు సినిమాతో అమలు పరిచారు. అప్పట్లో గ్రాఫిక్స్ అంటే ఎలా షూట్ చేయాలో కూడా ఎవరికీ తెలియదని, అమెరికా నుండి క్రిస్ అనే వ్యక్తిని రప్పించి గ్రీన్ మ్యాట్ షూటింగ్‌పై అవగాహన కల్పించారని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

దేవి సినిమాకు తను కో-డైరెక్టర్‌గా పనిచేశానని దేవి ప్రసాద్ తెలిపారు. అమ్మోరు సమయంలో గ్రాఫిక్స్ అన్నీ అమెరికాలో చేయిస్తే, దేవి సినిమా సమయానికి బాంబే, చెన్నైలలో గ్రాఫిక్స్ చేసేవారు వచ్చారని, క్రెస్ట్ కమ్యూనికేషన్స్ (బాంబే) వారు ఈ సినిమా గ్రాఫిక్స్ చేశారని వివరించారు. దేవి సినిమా విలన్ పాత్ర కోసం మొదట ఆఫ్రికా నుండి ఒక వ్యక్తిని ఎం.ఎస్. రాజు గారు తీసుకొచ్చారని, అయితే అతనికి తెలుగు రాకపోవడం, పాత్రను అర్థం చేసుకోలేకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైందని చెప్పారు. ఆ తర్వాత కేరళకు చెందిన ఎస్సై అబూ సలీంను విలన్‌గా తీసుకున్నారని, అతనికి తెలుగు రాకపోయినా, అతని బాడీ లాంగ్వేజ్ బాగుండటంతో ఎంపిక చేశారని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

అబూ సలీం నిజానికి ఆరు అడుగుల లోపే ఉంటాడని, కానీ ఫోటోగ్రఫీ ట్రిక్స్‌తో, వాటర్ లోంచి వచ్చే సన్నివేశాలతో అతన్ని సినిమాలో చాలా భారీగా చూపించగలిగారని దేవి ప్రసాద్ వివరించారు. అతని డైలాగులకు బొమ్మాళి రవి డబ్బింగ్ చెప్పారని తెలిపారు. ఎక్కడ, ఎందుకు సీజీ గ్రాఫిక్స్ వాడాలి అనే దానిపై కోడి రామకృష్ణ గారికి ఉన్న స్పష్టమైన అవగాహనే ఆయన విజయ రహస్యమని అన్నారు. ప్రస్తుతం దేవి సినిమా విలన్ మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

Follow Us