AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోళ్లపై కనిపించే తెల్లటి నెలవంక ఏం సూచిస్తుంది? ఏ వేలిపై ఉంటే ఎలాంటి అదృష్టం కలుగుతుందో తెలుసా!

White Crescent on Fingernails: మీ గోళ్లపై కనిపించే తెల్లటి నెలవంక (లునులా) ఏం సూచిస్తుంది? సముద్రిక శాస్త్రం ప్రకారం బొటనవేలు నుంచి చిటికెన వేలు వరకు ప్రతి గోరుపై కనిపించే ఈ గుర్తుకు ప్రత్యేకమైన అర్థం ఉంది. ఏ వేలిపై ఉంటే ఎలాంటి అదృష్టం, కెరీర్, ధనయోగం, నాయకత్వ లక్షణాలు కలుగుతాయో తెలుసుకోండి.

గోళ్లపై కనిపించే తెల్లటి నెలవంక ఏం సూచిస్తుంది? ఏ వేలిపై ఉంటే ఎలాంటి అదృష్టం కలుగుతుందో తెలుసా!
White Crescent On Fingernails
Rajashekher G
|

Updated on: Jul 13, 2026 | 9:52 PM

Share

Lunula Meaning: హస్తసాముద్రిక శాస్త్రం అరచేతిపై ఉండే గీతలు మాత్రమే కాదు, చేతి ఆకృతి, వేళ్లు, గోళ్ల నిర్మాణం వంటి అంశాలను కూడా విశ్లేషిస్తుంది. ముఖ్యంగా గోళ్ల అడుగు భాగంలో కనిపించే తెల్లటి అర్ధచంద్రాకార గుర్తు (లునులా) గురించి సముద్రిక శాస్త్రంలో ప్రత్యేక ప్రస్తావన ఉంది. చాలా మంది ఈ గుర్తును సాధారణంగా తీసుకుంటారు. అయితే సముద్రిక శాస్త్రం ప్రకారం, ఇది వ్యక్తి అదృష్టం, వ్యక్తిత్వం, భవిష్యత్తు అవకాశాల గురించి కొన్ని సంకేతాలను తెలియజేస్తుందని చెబుతారు. సముద్రిక శాస్త్రం ప్రకారం, గోళ్లపై స్పష్టంగా కనిపించే తెల్లటి నెలవంక అదృష్టం, శక్తి, అభివృద్ధి, బలమైన సంకల్పానికి ప్రతీకగా భావిస్తారు. కొందరికి ఈ గుర్తు కేవలం బొటనవేలుపైనే కనిపిస్తే, మరికొందరికి అన్ని వేళ్ల గోళ్లపైనా ఉంటుంది. అన్ని గోళ్లపై ఈ గుర్తు స్పష్టంగా ఉంటే, జీవితంలో విజయానికి ఎదురయ్యే అడ్డంకులు తక్కువగా ఉంటాయని విశ్వసిస్తారు.

బొటనవేలుపై నెలవంక

బొటనవేలు గోరుపై తెల్లటి నెలవంక కనిపించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి వారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధించి, జీవితంలో ఆర్థికంగా, సామాజికంగా మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సముద్రిక శాస్త్రం చెబుతోంది.

చూపుడు వేలుపై నెలవంక

చూపుడు వేలు నాయకత్వం, అధికారం, ప్రతిష్ఠకు సూచికగా పరిగణిస్తారు. ఈ వేలి గోరుపై నెలవంక గుర్తు ఉంటే ఆకస్మిక ధనలాభాలు, ఉద్యోగంలో పదోన్నతులు లేదా కెరీర్‌లో వేగవంతమైన పురోగతి సాధించే అవకాశాలు ఉంటాయని అంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే యోగం కూడా ఉంటుందని విశ్వసిస్తారు. ఇలాంటి వారు మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని చెబుతారు.

ఇవి కూడా చదవండి

మధ్య వేలుపై నెలవంక

మధ్య వేలు గోరుపై తెల్లటి నెలవంక కనిపిస్తే, సాంకేతిక, పరిశోధన, ఇంజినీరింగ్ లేదా ఆధునిక రంగాల్లో విశేష విజయాలు సాధించే అవకాశం ఉందని సముద్రిక శాస్త్రం పేర్కొంటుంది. కష్టపడే స్వభావంతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని భావిస్తారు.

ఉంగరపు వేలుపై నెలవంక

ఉంగరపు వేలిపై నెలవంక గుర్తు ఉంటే గౌరవం, కీర్తి, సామాజిక గుర్తింపు లభిస్తాయని చెబుతారు. కొందరి అభిప్రాయం ప్రకారం ప్రభుత్వ రంగంలో మంచి అవకాశాలు రావడంతో పాటు సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు, ప్రతిష్ఠ పొందే అవకాశం ఉంటుంది.

చిటికెన వేలుపై నెలవంక

చిటికెన వేలు వ్యాపారం, కమ్యూనికేషన్, తెలివితేటలకు ప్రతీకగా భావిస్తారు. ఈ వేలి గోరుపై నెలవంక గుర్తు ఉంటే వ్యాపారంలో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుందని అంటారు. అలాగే మాట్లాడే నైపుణ్యం, ఒప్పించే శక్తి, వ్యాపార నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటాయని సముద్రిక శాస్త్రం పేర్కొంటుంది.

(Disclaimer: ఈ సమాచారం సముద్రిక శాస్త్రంలోని సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. గోళ్లపై కనిపించే తెల్లటి అర్ధచంద్రాకార భాగం (లునులా) ఆరోగ్యపరమైన అంశాలతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు. ఆరోగ్యంపై సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!