Sammathame Review: ప్రెజెంట్‌ సిట్చువేషన్‌ని డిస్కస్‌ చేసే ‘సమ్మతమే’.. మూవీ రివ్యూ

| Edited By: Anil kumar poka

Jun 24, 2022 | 1:08 PM

Sammathame movie Review: టీజర్‌, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ఆసక్తి పెంచిన సినిమా సమ్మతమే. తనకంటూ ఓన్‌ డిక్షన్‌, రాజావారు రాణిగారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం సినిమాలతో వచ్చిన ఇమేజ్‌తో కిరణ్‌ అబ్బవరం ప్రేక్షకుల్లో ఓపెనింగ్స్ కి ఢోకా లేని హీరోగా పేరు తెచ్చుకున్నారు.

Sammathame Review: ప్రెజెంట్‌ సిట్చువేషన్‌ని డిస్కస్‌ చేసే సమ్మతమే.. మూవీ రివ్యూ
Sammathame
Follow us on

Sammathame Movie Review: టాలీవుడ్‌లో రెండు పదులకు పైగా హీరోలున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌. ఒకప్పుడు శర్వానంద్‌ సినిమాలు వస్తున్నాయంటే, ఎలాంటి క్రేజ్‌ ఉండేదో… ఇప్పుడు కిరణ్ అబ్బవరం సినిమాల మీద కూడా స్పెషల్‌ ఫోకస్‌ ఉంటోంది. మరి సమ్మతమే ఆ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్‌ అయిందా? చూసేద్దాం…

సినిమా: సమ్మతమే

సంస్థ: యుజి ప్రొడక్షన్స్

ఇవి కూడా చదవండి

నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, చాందినీ చౌదరి, అన్నపూర్ణమ్మ,

సంగీతం: శేఖర్‌ చంద్ర

కెమెరా: సతీష్‌ రెడ్డి మాసం

దర్శకుడు: గోపీనాథ్‌ రెడ్డి

ఎడిటింగ్‌: విప్లవ్‌ నైషదం

ఆర్ట్: సుధీర్‌ మాచర్ల

నిర్మాత: కంకణాల ప్రవీణ

విడుదల: 24.06.2022

ఇంట్లో అమ్మాయి తిరిగితే కళగా ఉంటుందని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అబ్బాయి (కిరణ్‌ అబ్బవరం). జీవితంలో సెటిల్‌ అయితే పెళ్లి చేస్తానంటాడు వాళ్ల నాన్న. అన్నీ విధాలా సెటిల్‌ అయ్యాక పెళ్లి చేసుకున్న అమ్మాయినే ప్రేమించాలనుకుంటాడు అబ్బాయి. పెళ్లి చూపుల వేట మొదలవుతుంది. తను చేసుకోబోయే అమ్మాయి పద్ధతికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండాలనుకునే అతని కల నెరవేరిందా? లేదా? ఎన్ని పెళ్లి చూపులకు వెళ్లాడు? శాన్వి(చాందిని చౌదరి)తో అతని జీవితం ఎలా సాగింది? ఆమెను మార్చుకున్నాడా? అతను మారాడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే సమ్మతమే.

టీజర్‌, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ఆసక్తి పెంచిన సినిమా సమ్మతమే. తనకంటూ ఓన్‌ డిక్షన్‌, రాజావారు రాణిగారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం సినిమాలతో వచ్చిన ఇమేజ్‌తో కిరణ్‌ అబ్బవరం ప్రేక్షకుల్లో ఓపెనింగ్స్ కి ఢోకా లేని హీరోగా పేరు తెచ్చుకున్నారు. లేటెస్ట్‌గా సమ్మతమేలో కూడా తనదైన రాయలసీమ యాక్సెంట్‌తో మెప్పించే ప్రయత్నం చేశారు. విలేజ్‌ నుంచి, స్మాల్‌ టౌన్‌ నుంచి సిటీకి వచ్చి సెటిలైన అబ్బాయిల మైండ్‌సెట్‌ను చాలా వరకు రిఫ్లక్ట్ చేస్తుంది హీరో కేరక్టర్‌. పక్కా సిటీలో పెరిగిన అమ్మాయికి రెప్లికా చాందిని రోల్‌. ఆడపిల్లలు సిగరెట్‌ తాగితే తప్పా? మందు తాగే అమ్మాయిలకు కేరక్టర్‌ ఉండదా? కన్నవాళ్లతో కూతుళ్లు ఎలాంటి సందర్భాల్లో అబద్దాలు చెబుతారు? నైట్‌ ఔట్‌ కల్చర్‌ ని సొసైటీ ఎలా చూస్తుంది? ఇలాంటి అంశాలన్నీ సినిమాల్లో చర్చకు వస్తాయి.

Sammathame

కూతురి అబద్దాలను అర్థం చేసుకునే తండ్రిగా శివన్నారాయణ రోల్‌ బావుంది. అన్నపూర్ణమ్మకి మంచి రోల్‌ పడింది. లొకేషన్స్ సిటీ కల్చర్‌ని రిఫ్లక్ట్ చేశాయి. పాటలు విడిగా వింటే అంతగా మెప్పించవుగానీ, సన్నివేశాలతో సింక్‌ అయ్యాయి. కథలో అనూహ్యమైన మలుపులు పెద్దగా ఉండవు. అంతా ముందే తెలిసిపోయినట్టే ఉంటుంది. ఇదివరకు చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే రిపీట్ అవుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బెటర్‌గా ఉండేదేమో.

‘ అసలే రోజులు బాలేవు. బయటికెళ్లిన అమ్మాయి ఎంత సేఫ్‌గా వస్తుందో తెలియని సమాజంలో ఉన్నాం’ అని హీరో అంటే….. ‘అమ్మాయిలు బయటికి వెళ్లినప్పుడు పద్ధతిగా ఉండాలని చెప్పాల్సిన పనిలేదు. ఆ మాటకొస్తే మారాల్సింది రోజులే.. అమ్మాయిలు కాదు’ అని శివన్నారాయణ చెప్పే మాట సొసైటీకి చెంపపెట్టు.

Sammathame

దర్శకుడి ఇంటెన్షన్‌ మంచిదే. ఆర్టిస్టులందరూ అర్థం చేసుకుని యాక్ట్ చేశారు. ఇంకాస్త వినోదం కలిపి, షార్ప్ గా చెప్పి ఉంటే అందరూ మూకుమ్మడిగా సమ్మతం తెలిపేవారేమో!

– డా. చల్లా భాగ్యలక్ష్మి

మరిన్ని సినిమా వార్తలు చదవండి..