AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

chiranjeevi: చిరు154 మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. అప్పుడే విడుదల తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్‌..

chiranjeevi: 'ఖైదీ నెంబర్‌ 150'తో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి ఆ తర్వాత 'సైరా నర్సింహ రెడ్డి' సినిమా కోసం రెండేళ్ల గ్యాప్‌ ఇచ్చారు. ఇక అనంతరం 'ఆచార్య' సినిమాకు కరోనా కారణంగా..

chiranjeevi: చిరు154 మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. అప్పుడే విడుదల తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్‌..
Narender Vaitla
|

Updated on: Jun 24, 2022 | 11:54 AM

Share

chiranjeevi: ‘ఖైదీ నెంబర్‌ 150’తో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి ఆ తర్వాత ‘సైరా నర్సింహ రెడ్డి’ సినిమా కోసం రెండేళ్ల గ్యాప్‌ ఇచ్చారు. ఇక అనంతరం ‘ఆచార్య’ సినిమాకు కరోనా కారణంగా రెండేళ్లు గ్యాచ్‌ వచ్చింది. దీంతో వరుసగా సినిమాలు విడుదల చేయాలని ఫిక్స్‌ అయిన చిరు ఏక కాలంలో పలు ప్రాజెక్టులను ట్రాక్‌ ఎక్కించారు. ప్రస్తుతం చిరు ఒకేసారి మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి. చిరంజీవి 154వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘వల్తేర్‌ వీరయ్య’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ సినిమాను 2023 సంక్రాంతికానుకగా విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే అధికారికంగా సినిమా టైటిల్‌ను, టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టాలీవుడ్‌కు కలిసొచ్చే సంక్రాంతి బరిలో దిగడానికే చిత్ర మైత్రీ మూవీ మేకర్స్‌ మొగ్గుచూపారు.

Chiru 154

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ 40 శాతం పూర్తయింది. తర్వాతి షెడ్యూల్‌ను వచ్చే నెలలో మొదలు పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. చిరుకు జోడిగా శృతీ హాసన్‌ నటిస్తోన్న ఈ సినిమాను మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా విల్సన్‌ సినిమాటోగ్రఫీగా వ్యవహరిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..