Khiladi: అందరి సమక్షంలో హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పిన ‘ఖిలాడి’ డైరెక్టర్‌.. కారణం ఏంటంటే..

| Edited By: Ravi Kiran

Feb 10, 2022 | 5:12 PM

Khiladi: మాస్‌ హహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఖిలాడి'. 'క్రాక్‌' వంటి సూపర్ హిట్‌ తర్వాత రవితేజ నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే చిత్ర దర్శకుడు కూడా సినిమాను భారీగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకు..

Khiladi: అందరి సమక్షంలో హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పిన ఖిలాడి డైరెక్టర్‌.. కారణం ఏంటంటే..
Khiladi Movie
Follow us on

Khiladi: మాస్‌ హహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖిలాడి’. ‘క్రాక్‌’ వంటి సూపర్ హిట్‌ తర్వాత రవితేజ నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే చిత్ర దర్శకుడు కూడా సినిమాను భారీగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అఖండ, పుష్పల తర్వాత థియేటర్లలలో సందడి చేస్తున్న మరో భారీ చిత్రం కూడా ఇదే కావడంతో ఇండస్ట్రీ దృష్టి కూడా ఈ సినిమాపై పడింది.

ఫిబ్రవరి 11న (శుక్రవారం) విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ పెంచే పనిలో పడ్డ చిత్ర యూనిట్‌ బుధవారం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాల్గొంది. అయితే ఈ సందర్భంగా దర్శకుడు రమేశ్‌ వర్మ స్టేజ్‌పై అందరి సమక్షంలోనే హీరోయిన్‌ మీనాక్షి చౌదరికి క్షమాపణాలు చెప్పారు. దర్శకుడు హీరోయిన్‌కు క్షమాపణలు ఎందుకు చెప్పారనేగా మీ సందేహం.. ఈ సినిమాలో మీనాక్షి చౌదరితో పాటు, డింపుల్‌ హయాతి కూడా నటించిన విషయం తెలిసిందే.

అయితే చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్‌ను హయాతినే ఎక్కువలా హైలట్‌ చేశారు. దీంతో ఇదే విషయాన్ని ప్రస్తావించిన డైరెక్టర్‌ స్పందిస్తూ.. ‘ఖిలాడి’ ట్రైలర్‌లో డింపుల్‌ హయానితే ఎందుకో ఎక్కువగా చూపించారు. ఈ విషయంలో ఐయామ్‌ ఎక్స్‌ట్రీమ్లీ సారీ.. సినిమా చూశాక నువ్వు సంతోషిస్తావు. సినిమాలో ఇద్దరికీ సమాన ప్రాధన్యత ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ వీకెండ్‌లో సందడి చేయడానికి సిద్ధమవుతోన్న మాస్‌ మహారాజ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Also Read: Ranu Mondal: శ్రీవల్లి సాంగ్ లోని అల్లు అర్జున్ హుక్ స్టెప్ ని అనుకరించిన రాను మండల్.. వద్దు బాబోయ్ అంటున్న నెటిజన్లు..

Rajya Sabha: రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ వాకౌట్.. ప్రధానిపై ఇచ్చిన ప్రివిలేజ్ మోష‌న్‌పై నిర్ణయం తీసుకోవాలిః కేకే

యువతికి దగ్గరై.. మరో యువతితో పెళ్లికి సిద్ధమై.. అసలేం జరిగిందంటే..??