మహేష్‌తో నటించబోతున్నా.. కన్ఫర్మ్ చేసిన కీర్తి

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు- మహానటి కీర్తి సురేష్‌. ఈ జోడీ కలిసి నటిస్తే చూడాలని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మహేష్‌తో నటించబోతున్నా.. కన్ఫర్మ్ చేసిన కీర్తి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 18, 2020 | 10:44 PM

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు- మహానటి కీర్తి సురేష్‌. ఈ జోడీ కలిసి నటిస్తే చూడాలని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే వారి కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారు. ఈ విషయాన్ని కీర్తినే స్వయంగా వెల్లడించింది. మహేష్ బాబు సినిమాలో తాను నటిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కీర్తి నటించిన పెంగ్విన్ చిత్రం శుక్రవారం ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అవ్వబోతుండగా.. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించారు కీర్తి. అందులో మహేష్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చారు.

కాగా మహేష్‌ బాబు- పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపించగా.. అందులో కీర్తి కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మహానటి కన్ఫర్మ్ చేయడంతో.. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉంటే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సర్కారు వారి పాట ఉండబోతోంది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, మహేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్యన విడుదలైన మహేష్ ప్రీ లుక్‌ ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Read This Story Also: దోపిడికి గురై ఏడ్చేసిన డెలివరీ బాయ్.. వస్తువులను తిరిగిచ్చేసిన దొంగలు