మహేష్ ‘సర్కారు వారి పాట’ మూవీ తొలిదశ షూటింగ్ పూర్తి.. సెకండ్ షెడ్యూల్ కోసం బయలుదేరిన మహానటి..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో.. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఇందులో మహేష్‌కు కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది.

Actress Keerthi Suresh : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో.. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఇందులో మహేష్‌కు కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ దుబాయ్‌లో శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ రేపు ప్రారంభం కానుంది. ఇక ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్లో పాల్గొనేందుకు కీర్తి.. తన ట్రావెల్ బ్యాగ్‌తో సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోను కీర్తి తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది.
ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగంలో జరిగే భారీ కుంభకోణాలు చుట్టూ జరుగుతుంది. ఇందులో ప్రకాశ్ రాజ్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కానీ ఈ సినిమాలో విలన్ ఎవరనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు చిత్రయూనిట్. మహేష్, పరశురాం కాంబోలో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.
View this post on Instagram
Also Read:
మలేరియాతో ఇబ్బంది పడుతున్నా షూటింగ్ మిస్ చేయలేదు.. గత సంవత్సర అనుభవాలను చెబుతున్న అందాల తార..
