AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మలేరియాతో ఇబ్బంది పడుతున్నా షూటింగ్ మిస్ చేయలేదు.. గత సంవత్సర అనుభవాలను చెబుతున్న అందాల తార..

Kriti Kharbanda : బాలీవుడ్ అందాల తార కృతి కర్బంద కరోనా సంవత్సరంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించింది. ఓ నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో

మలేరియాతో ఇబ్బంది పడుతున్నా షూటింగ్ మిస్ చేయలేదు.. గత సంవత్సర అనుభవాలను చెబుతున్న అందాల తార..
uppula Raju
|

Updated on: Feb 15, 2021 | 9:00 PM

Share

Kriti Kharbanda : బాలీవుడ్ అందాల తార కృతి కర్బంద కరోనా సంవత్సరంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించింది. ఓ నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికర విషయాలను తెలియజేసింది. 2020ని తన కెరియర్‌లోనే ‘లో పాయింట్‌’గా వివరించింది. లాక్‌డౌన్ ప్రారంభంలో 21 రోజుల తర్వాత అంతా నార్మల్ అయిపోతుందనుకున్నా కానీ చివరకు అది ఆరు నెలల వరకు కొనసాగిందని చెప్పింది. ఇక లాక్‌డౌన్ ముగిశాక వర్క్ మొదలెట్టే టైమ్‌లో కెమెరాను ఎదుర్కోవడం చాలా ఎమోషనల్‌గా అనిపించిందని తెలిపింది.

అయితే ఆ సమయంలో తను మలేరియాతో బాధపడుతున్నానని వైద్యులు బయటకు వెళ్లకూడదని సూచించినా వినలేదని తెలిపింది. పనిచేయాలనే తపనతో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నా పనిచేయాల్సి వచ్చిందని గుర్తు చేసింది. దేవుడి దయతో తనకు కరోనా సోకలేదని పేర్కొంది. కొవిడ్ తర్వాత ‘14 ఫెరే’సినిమా షూటింగ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలిపింది.

Tamil Actress Ovia Helen : ఆ నటిపై దేశద్రోహం కేసు పెట్టాలి.. బీజేపీ నాయకుల డిమాండ్.. ఎందుకో తెలుసా..

Follow Us