రేపే ‘కథనం’ టీజర్

హైదరాబాద్: అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ‘కథనం’ మూవీ టీజర్‌ను రేపు విడుదల చేయనున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న విడుదల చేసేందుకు నిర్ణయించినట్టు చిత్ర బృందం ప్రకటించింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు నాదెండ్ల రాజేశ్ దర్శకత్వం వహించారు. అవసరాల శ్రీనివాస్, థన్‌రాజ్ ఇందులో ప్రముఖ పాత్రలు పోషించారు. క్షణం, రంగస్థలం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయకు ఈ కథనం సినిమాతో మరింత పేరు వచ్చే అవకాశం ఉంది. లేడీ ఓరియంటెడ్ […]

రేపే 'కథనం' టీజర్
Vijay K

|

Mar 07, 2019 | 12:21 PM

హైదరాబాద్: అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ‘కథనం’ మూవీ టీజర్‌ను రేపు విడుదల చేయనున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న విడుదల చేసేందుకు నిర్ణయించినట్టు చిత్ర బృందం ప్రకటించింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు నాదెండ్ల రాజేశ్ దర్శకత్వం వహించారు.

అవసరాల శ్రీనివాస్, థన్‌రాజ్ ఇందులో ప్రముఖ పాత్రలు పోషించారు. క్షణం, రంగస్థలం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయకు ఈ కథనం సినిమాతో మరింత పేరు వచ్చే అవకాశం ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు అనసూయ ప్రిఫరెన్స్ ఇస్తోంది. మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలకు ఆమెను ఎంచుకునేలా అనసూయను గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu