Kartik Aaryan Team Up Shah Rukh: డిఫరెంట్ లవ్ స్టోరీతో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌ తో జతకట్ట నున్న బాలీవుడ్ బాద్షా

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు సినీ నిర్మాణం రంగంలో బిజీగా ఉన్నాడు.. తాజాగా షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఓ యంగ్ హీరోతో సినిమాను..

Kartik Aaryan Team Up Shah Rukh: డిఫరెంట్ లవ్ స్టోరీతో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌ తో జతకట్ట నున్న బాలీవుడ్ బాద్షా

Updated on: Jan 27, 2021 | 5:36 PM

Kartik Aaryan Team Up Shah Rukh : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు సినీ నిర్మాణం రంగంలో బిజీగా ఉన్నాడు.. తాజాగా షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఓ యంగ్ హీరోతో సినిమాను నిర్మించడానికి సన్నాలు చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ బీ టౌన్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌ బాలీవుడ్ లో స్పెషల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. డిఫరెంట్ నేపధ్య కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కరోనా తో భూల్ భులైయా2, దోస్తానా2 షూటింగ్ లెట్ అయ్యింది. అయితే మరో సినిమాలో నటించడానికి ఓకే చెప్పాడని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు అజయ్ భల్ దర్శకత్వం లో షారుఖ్ ఖాన్ నిర్మిస్తున్న సినిమాలో కార్తీక్ నటిస్తున్నాడనే వార్తలు ఓ రేంజ్ లో బీ టౌన్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే షారుఖ్ కార్తీక్ ని కలవగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాపై త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారట.. కాగా షారుఖ్ ఖాన్ కు గత కొంత సక్సెస్ ముఖం చాటేసింది.. జీరో కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ మూవీగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ నటిస్తాడా.. లేక నిర్మతగానే వ్యవహరిస్తాడా అంటూ ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read: సోషల్ మీడియాతో సమయం వృధా అవుతుంది.. ఇక నుంచి సోషల్ మీడియాకు గుడ్‌బై అంటున్న హాలీవుడ్ నటి